జడేజా అవుట్‌.. అశ్విన్‌ ఇన్‌ | Ashwin Replaces Injured Jadeja | Sakshi

జడేజా అవుట్‌.. అశ్విన్‌ ఇన్‌

Published Sat, Mar 10 2018 3:43 PM | Last Updated on Sat, Mar 10 2018 3:50 PM

Ashwin Replaces Injured Jadeja - Sakshi

న్యూఢిల్లీ : ఇరానీ కప్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌ను దృష్టిలో పెట్టుకుని టీమ్‌ను సెలెక్ట్‌ చేసిన బీసీసీఐ సీనియర్‌ స్పిన్నర్‌ అశ్విన్‌కు చోటు కల్పించింది. గాయంతో బాధపడుతున్న ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా స్థానాన్ని అశ్విన్‌ భర్తీ చేయనున్నాడు. గాయం కారణంగా దేవధర్‌ ట్రోఫీకి దూరమైన అశ్విన్‌ ప్రస్తుతం కోలుకోవడంతో రెస్టాఫ్‌ ఇండియా స్క్వాడ్‌కు ఎంపిక చేసినట్లు బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ టీమ్‌కు కరుణ్‌ నాయర్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. పృథ్వీ షా, మయాంక్‌ అగర్వాల్‌ వంటి యువ ఆటగాళ్లను జట్టులోకి తీసుకున్నారు. రెస్టాఫ్‌ ఇండియా జట్టు మార్చ్‌ 14 నుంచి 18 వరకు నాగపూర్‌లో జరగనున్న మ్యాచ్‌లో రంజీ ట్రోఫీ చాంపియన్స్‌తో తలపడనుంది.

రెస్టాఫ్‌ ఇండియా జట్టు:
కరుణ్‌ నాయర్(కెప్టెన్‌)‌, పృథ్వీ షా, అభిమన్యు ఈశ్వరన్‌, ఆర్‌. సమర్థ్‌, మయాంక్‌ అగర్వాల్‌, హనుమ విహారీ, కేఎస్‌ భరత్‌(వికెట్‌ కీపర్‌), అశ్విన్‌, జయంత్‌ యాదవ్‌, షాబాజ్‌ నదీమ్‌, అన్‌మోల్‌ప్రీత్‌ సింగ్‌, సిద్ధార్థ్‌ కౌల్‌, అంకిత్‌ రాజ్‌పుత్‌, నవ్‌దీప్‌ సైనీ, అతీత్‌   
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement