ఆఖరి ఓవర్లో కర్ణాటక గెలుపు  | Karnataka win in the last over | Sakshi
Sakshi News home page

ఆఖరి ఓవర్లో కర్ణాటక గెలుపు 

Published Tue, Mar 6 2018 12:37 AM | Last Updated on Tue, Mar 6 2018 12:37 AM

Karnataka win in the last over - Sakshi

సమర్థ్‌

ధర్మశాల: విజయానికి 6 బంతుల్లో 11 పరుగులు అవసరం. భారత్‌ ‘బి’ బ్యాట్స్‌మన్‌ సిద్దేశ్‌ లాడ్‌ (70; 6 ఫోర్లు) జోరు మీదున్నాడు. చివరి ఓవర్‌ వేసేందుకు ఆఫ్‌ స్పిన్నర్‌ కృష్ణప్ప గౌతమ్‌ బంతినందుకున్నాడు. ఈ స్థితిలో ‘బి’ జట్టే గెలిచేలా కనిపిచింది. కానీ గౌతమ్‌ కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేశాడు. లాడ్‌ను అవుట్‌ చేయడంతో పాటు నాలుగే పరుగులిచ్చాడు. దీంతో సోమవారం జరిగిన దేవధర్‌ ట్రోఫీ వన్డే మ్యాచ్‌లో కర్ణాటక 6 పరుగులతో నెగ్గింది. మొదట కర్ణాటక 50 ఓవ ర్లలో 8 వికెట్లకు 296 పరుగులు చేసింది.

రవి సమర్థ్‌ (117; 13 ఫోర్లు, 1 సిక్స్‌)  శతకం బాదాడు. సిద్ధార్థ్‌ కౌల్‌ (3/49) రాణించాడు. ఛేదనలో ‘బి’ జట్టు 23 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఆంధ్ర ఆటగాడు హనుమ విహారి (4) విఫలమయ్యాడు. ఈ స్థితిలో మనోజ్‌ తివారీ (120; 10 ఫోర్లు, 4 సిక్స్‌లు) నిలిచాడు. చక్కగా ఆడిన అతడికి కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (33), లాడ్‌ సహకరించారు. 42వ ఓవర్‌కు 241/4తో విజయం దిశగా సాగుతున్నట్లు కనిపించినా వెంటవెంటనే నాలుగు వికెట్లు కోల్పోయి వెనుకబడింది. శ్రేయస్‌ గోపాల్‌ 3 వికెట్లు తీశాడు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement