అజ్యింకా రహానే (ఫైల్‌ఫొటో)
ఢిల్లీ: దేవధర్ ట్రోఫీలో భాగంగా ఫిరోజ్ షా కోట్ల మైదానం జరుగుతున్న తుది పోరులో ఇండియా ‘సి’ కెప్టెన్ అజింక్యా రహానే భారీ సెంచరీ సాధించాడు. ఇండియా ‘బి’తో తుది పోరులో ఓపెనర్‌గా బరిలోకి దిగిన రహానే అజేయంగా 144 పరుగుల వ‍్యక్తిగత స్కోరు నమోదు చేశాడు. 156 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో రహానే వీరోచిత ఇన్నింగ్స్ ఆడాడు. అతనికి జతగా ఇషాన్ కిషన్(114;87 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్సర్లు) శతకం సాధించడంతో ఇండియా ‘సి’ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల కోల్పోయి 352 పరుగులు చేసింది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇండియా ‘సి’ ముందుగా బ్యాటింగ్ తీసుకుంది. దాంతో ఇండియా ‘సి’ బ్యాటింగ్‌ను అజింక్యా రహానే, ఇషాన్ కిషన్‌లు ఆరంభించారు. వీరిద్దరూ తొలి వికెట్టుకు 210 పరుగుల భాగస‍్వామ్యాన్ని సాధించిన తర్వాత ఇషాన్ పెవిలియన్‌కు చేరాడు. అనంతరం శుబ్‌మాన్ గిల్(26), సూర్యకుమార్ యాదవ్(39)లు నుంచి మాత‍్రమే రహానేకు సహకారం లభించగా, సురేశ్ రైనా(1), విజయ్ శంకర్(4)లు నిరాశపరిచారు. రహానే కడవరకూ క్రీజ్‌లో ఉండటంతో ఇండియా ‘సి’ 350కు పైగా పరుగుల్ని స్కోరు బోర్డుపై ఉంచుంది. ఇండియా ‘బి’ బౌలర్ జయదేవ్ ఉనాద్కత్ మూడు వికెట్లు సాధించగా, దీపక్ చాహర్, మయాంక్ మార్కండేలకు తలో రెండు వికెట్లు లభించాయి.
Comments
Please login to add a commentAdd a comment