
కోహ్లి వన్డే కెప్టెన్సీ వివాదం ఎంత పెద్ద రచ్చగా మారిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కోహ్లి తనపై చేసిన వ్యాఖ్యల పట్ల బీసీసీఐ అధ్యక్షుని హోదాలో షోకాజ్ నోటీసులు ఇవ్వబోయాడంటూ వార్తలు వచ్చాయి. గంగూలీ ఆ వార్తల్లో నిజం లేదంటూ తానే స్వయంగా ఖండించాడు. దీంతో ఇప్పటికీ కోహ్లి-బీసీసీఐ వివాదం ఇంకా అలానే నడుస్తోందని పలువురు భావిస్తున్నారు.
తాజాగా ఈ అంశంపై టీమిండియా దిగ్గజ ఆటగాడు.. మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ మరోసారి స్పందించాడు. '' కోహ్లి, గంగూలీ మధ్య విభేదాలు ఉన్నాయని వస్తున్న వార్తలపై వాళ్లిద్దరు ఫోన్ చేసుకొని మాట్లాడుకుంటే మంచిది. భారత క్రికెట్ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఈ సమస్యకు తొందరగా ముగింపు పలకాలని కోరుకుంటున్నా'' అని పేర్కొన్నాడు.
చదవండి: వరుసగా రెండో ఓటమి.. వసీం జాఫర్ మాత్రం తగ్గేదే లే
కాగా దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు ఒక్కరోజు మీడియా ముందుకు వచ్చిన కోహ్లి కెప్టెన్సీ తొలగింపుపై సంచలన ఆరోపణలు చేశాడు. టి20 కెప్టెన్సీ నుంచి వైదొలిగినప్పుడు తనను ఎవరు వద్దనలేదని.. గంగూలీ తన వద్దకు వచ్చి అడిగాడన్న వార్తల్లో కూడా నిజం లేదని కుండబద్దలు కొట్టాడు. తనకు చెప్పకుండానే వన్డే కెప్టెన్సీ నుంచి తొలగించారంటూ పేర్కొన్నాడు.
ఇక తాజాగా సౌతాఫ్రికాపై టెస్టు సిరీస్ ఓటమి అనంతరం విరాట్ కోహ్లి టెస్టు కెప్టెన్సీ నుంచి వైదొలిగాడు. ప్రస్తుతం అన్ని ఫార్మాట్లలోనూ సీనియర్ ఆటగాడిగా ఉన్న కోహ్లి.. ఇకపై బ్యాటింగ్‌లో పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని అనుకుంటున్నాడు. కోహ్లి సెంచరీ చేసి మూడేళ్లు కావొస్తుండడంతో అతని ఫ్యాన్స్ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రానున్న కాలంలో కోహ్లి తన సెంచరీల కొరత తీర్చుకుంటాడని ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
చదవండి: కోహ్లి ఇది మంచి పద్దతి కాదేమో!
Comments
Please login to add a commentAdd a comment