Aakash Chopra: జనవరి 19 నుంచి దక్షిణాఫ్రికాతో జరగనున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం 18 మంది సభ్యుల భారత బృందాన్ని బీసీసీఐ శుక్రవారం(డిసెంబర్ 31, 2021) ప్రకటించింది. పరిమిత ఓవర్ల సారధి రోహిత్ శర్మ ఫిట్‌నెస్ సాధించకపోవడంతో అతడి స్థానంలో కేఎల్ రాహుల్ భారత వన్డే జట్టుకు నాయకత్వం వహించనుండగా, జస్ప్రీత్ బుమ్రా వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఈ నేపథ్యంలో జట్టులో టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లి స్థానాన్ని ఉద్దేశించి టీమిండియా మాజీ ఆటగాడు, వివాదాస్పద వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
టీమిండియాలో కోహ్లి పేరు పక్కన "కెప్టెన్" అనే పదం లేకపోవడం ఇబ్బందికరంగా అనిపించిందని, ఇలా జరగడం చాలా కాలం తర్వాత చూసానని, ఈ పరిణామం నిజంగా తనను బాధించిందంటూ తన యూట్యూబ్ ఛానల్ వేదికగా వ్యాఖ్యానించాడు. కాగా, గతేడాది జరిగిన టీ20 ప్రపంచ కప్ తర్వాత కోహ్లి టీమిండియా టీ20 సారధ్య బాధ్యతల నుంచి తప్పుకోగా.. బీసీసీఐ అతని స్థానాన్ని రోహిత్ శర్మతో భర్తీ చేసిన విషయం తెలిసిందే. అనంతరం కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి కూడా తప్పించిన భారత క్రికెట్ బోర్డు.. రోహిత్ శర్మకు పూర్తి స్థాయి పరిమిత ఓవర్ల పగ్గాలు అప్పగించింది.
దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు భారత వన్డే జట్టు: కేఎల్ రాహుల్(కెప్టెన్), శిఖర్ ధవన్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, వెంకటేశ్ అయ్యర్, రిషబ్ పంత్(వికెట్ కీపర్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), చహల్, ఆర్ అశ్విన్, వాషింగ్టన్ సుందర్, బుమ్రా(వైస్ కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, ప్రసిద్ధ్ కృష్ణ, శార్ధూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్
చదవండి: క్రిస్ గేల్‌కు ఘోర అవమానం..!
Comments
Please login to add a commentAdd a comment