
టీమిండియా వన్డే నూతన కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన రోహిత్ శర్మ తాను ఆచరించనున్న ప్రణాళికలపై కీలక వ్యాఖ్యలు చేశాడు. కెప్టెన్‌గా ఎంపికైన అనంతరం రోహిత్ మీడియాకు ఇంటర్య్వూ ఇచ్చాడు. కెప్టెన్‌గా తనకంటూ ఒక విజన్ ఉందని.. రానున్న రెండేళ్లలో ఐసీసీ వరల్డ్ కప్‌లు సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలోనే రోహిత్ శర్మ తనలోని నాలుగు ముఖ్య ఫిలాసఫీలను చెప్పుకొచ్చాడు.
''టీమిండియా మ్యాచ్‌లు ఆడుతుందంటే ఆటగాళ్ల వ్యక్తిగత రికార్డులకంటే టీమ్ పరంగా విజయాలు సాధిస్తే బాగుంటుందని రోహిత్ అభిప్రాయం. మనం ఎప్పుడైనా సీరియస్‌గా ఆట ఆడుతున్నప్పుడు.. ఎదో ఒకటి సాధించాలనే తపనతో బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. ముఖ్యంగా ఐసీసీ టోర్నమెంట్లలో ఆటగాళ్లు పరుగులు.. సెంచరీలు.. రికార్డులు బ్రేక్ చేయడం కంటే జట్టుకు టైటిల్ అందించాలనే లక్ష్యం గొప్పదిగా కనిపిస్తుంది.''
చదవండి: Rohit Sharma: అచ్చొచ్చిన డిసెంబర్ నెల.. ఎందుకో తెలుసా..?
''వైట్‌బాల్ క్రికెట్ అంటే ఒకరోజు.. లేదా నాలుగు గంటల్లో ముగిసిపోయే ఆట. ఆరోజు ఎవరు బాగా ఆడుతారనేదానిపై మంచి క్లారిటీ ఉండాలి. ఇందుకోసం జట్టు ఎంపిక ముఖ్యం. ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లకు అవకాశం ఇవ్వడమే కాదు.. సరైన సమయంలో సరైన ఆటగాడిని ఎంపిక చేసుకోవడం ముఖ్యం. కోహ్లి, రవిశాస్త్రిలు ఉన్న సమయంలో ఇలాంటివి చాలా తక్కువగా జరిగాయనేది నా అభిప్రాయం. కొత్త ఆటగాళ్లకు అవకాశమిస్తూ వారిలో కాన్ఫిడెంట్ లెవెల్స్ పెంచడమనేది ముఖ్యం''
''మ్యాచ్ ఉత్కంఠగా సాగినప్పుడు ఒత్తిడి నెలకొనడం సహజం. అందుకే పరిస్థితి దారుణంగా ఉన్నప్పుడు మూడో నెంబర్ నుంచి పదో నెంబర్ దాకా బ్యాటింగ్ చేయగలిగేలా టీమ్‌ను తయారు చేయాలి. ఐసీసీ లాంటి మేజర్ టోర్నీల్లో ఇది చాలా అవసరం. వచ్చే ఏడాదికాలంలో దీనిపై కాస్త శ్రద్ధ పెట్టాల్సి ఉంది. అయితే మిడిల్ ఆర్డర్ విషయంలోనూ ఒక క్లారిటీ అవసరం.''
''నా దృష్టిలో కెప్టెన్ అనేవాడు జట్టులో అత్యంత తక్కువ స్థానంలో ఉంటాడు. ఎందుకంటే జట్టును నడిపిస్తూ .. మంచి భవిష్యత్తు ఉన్న ఆటగాళ్లకు అవకాశాలు ఇస్తూ వారిలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచాలి. ముంబై ఇండియన్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించినా.. కోహ్లి గైర్హాజరులో టీమిండియాకు కెప్టెన్‌గా పనిచేసినప్పుడు నేను ఏదైతే అనుకున్నానో ఇప్పుడు కూడా అదే పాలసీకి కట్టుబడిఉంటా.'' అని తెలిపాడు.
చదవండి: ఆమె నా బిగ్గెస్ట్ సపోర్ట్ సిస్టమ్.. తన వల్లే ఇదంతా: రోహిత్ శర్మ
Comments
Please login to add a commentAdd a comment