టీమిండియా టెస్ట్ సారధి విరాట్ కోహ్లి సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టెస్ట్ సారధ్య బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్లు ట్విటర్ వేదికగా శనివారం ప్రకటించాడు. ఈ సందర్భంగా 7 ఏళ్ల కెప్టెన్సీ ప్రయాణంలో తనకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపాడు. కెప్టెన్‌గా అవకాశం ఇచ్చిన బీసీసీఐకి సైతం థ్యాంక్స్ చెప్పాడు.
‘నాకు అండగా నిలిచిన రవిశాస్త్రికి, ధోనికి ధన్యవాదాలు.ఇన్నేళ్ల ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా. కెప్టెన్సీ వదులుకునేందుకు ఇదే సరైన సమయం. కెప్టెన్సీ ఎప్పటికైనా వదులుకోక తప్పదు. కెప్టెన్సీ అవకాశం ఇచ్చిన బీసీసీఐకి కృతజ్ఞతలు’ అని ట్వీటర్ అకౌంట్‌లో పేర్కొన్నాడు. కాగా, దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్ కోల్పోయిన మరుసటి రోజే కోహ్లి సంచలన నిర్ణయం తీసుకోవడం క్రికెట్ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తుంది. కాగా, కోహ్లి.. ఇటీవలే వన్డే, టీ20 సారధ్య బాధ్యతలను కూడా వదులుకున్న సంగతి తెలిసిందే.
— Virat Kohli (@imVkohli) January 15, 2022
Comments
Please login to add a commentAdd a comment