భారత్, ఆస్ట్రేలియా మధ్య వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2021-23 ఫైనల్ ప్రారంభానికి కొద్ది గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. ప్రస్తుతం ఇరు జట్లు ప్రాక్టీస్‌ను పక్కన పెట్టి వ్యూహరచనలో నిమగ్నమై ఉన్నాయి. ఏ బ్యాటర్‌కు ఎలా అడ్డుకట్ట వేయాలో.. ఏ బౌలర్‌ను ఎలా నిలువరించాలో అన్న వాటిపై ఇరు జట్లు పథకాలు రచిస్తున్నాయి. తుది జట్లపై అనధికారికంగా ఇరు జట్లు ఇప్పటికే ప్రకటన చేశాయి. ఇక మిగిలింది మ్యాచ్ ఆరంభమే.
కాగా, డబ్ల్యూటీసీ ఫైనల్ 2021-23లో భారత్, ఆస్ట్రేలియా జట్లు గెలుపుపై ధీమాగా ఉన్నప్పటికీ.. గత రికార్డుల ప్రకారం చూస్తే టీమిండియాకే విజయావకాశాలు అధికంగా ఉన్నాయని తెలుస్తోంది. అదెలాగంటే.. భారత కెప్టెన్ రోహిత్ శర్మకు ఏ ఫార్మాట్‌లో అయిన కెప్టెన్‌గా తిరుగులేని రికార్డు ఉంది. హిట్‌మ్యాన్.. కెప్టెన్‌గా తన జట్టును ఫైనల్ చేర్చాడంటే, ఆ జట్టు గెలిచి తీరాల్సిందే.
Rohit Sharma 8/8 so far in finals. He will be looking forward to make it 9/9 in the WTC 2023 final.#CricTracker #RohitSharma #WTCFinal pic.twitter.com/KmJfnxeMgb
— CricTracker (@Cricketracker) June 6, 2023
రోహిత్ ఇప్పటివరకు కెప్టెన్‌గా తాను ప్రాతినిధ్యం వహించిన జట్లను మొత్తం 8 సార్లు ఫైనల్‌కు చేర్చాడు. ఈ 8 సందర్భాల్లో విజయం రోహిత్ సేననే వరించింది. కెప్టెన్‌గా రోహిత్‌కు ఇంత ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే భారత అభిమానులు ఈ సారి ఎలాగైనా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్స్ మనదేనని ధీమాగా ఉన్నారు. ఈ డబ్ల్యూటీసీ ఫైనల్లో గెలిస్తే రోహిత్‌కు ఇదే మొదటి ఐసీసీ టైటిల్ అవుతుంది.
గతంలో ఇతను 2018 ఆసియా కప్‌లో, 2018 నిదాహస్ టోర్నీలో టీమిండియాను విజేతగా నిలిపాడు. అలాగే ఐపీఎల్‌లో 2013, 2015, 2017, 2019, 2020 సీజన్లలో ముంబై ఇండియన్స్‌ను ఛాంపియన్‌గా నిలిపాడు. రోహిత్ సారధ్యంలో ముంబై ఇండియన్స్ 2013 ఛాంపియన్స్ లీగ్ కూడా గెలిచింది. ఈ లెక్కన రోహిత్ ఖాతాలో మొత్తం 8 టైటిల్‌లు చేరాయి.
నేటి నుంచి ప్రారంభంకాబోయే డబ్ల్యూటీసీ ఫైనల్ గెలిచి హిట్‌మ్యాన్ తన విజయయాత్రను కొనసాగిస్తూ 9వ టైటిల్‌ను సాధించాలని ఉవ్విళ్లూరుతున్నాడు. కెప్టెన్‌గా రోహిత్‌కు ఉన్న రికార్డు చూసి నెటిజన్లు.. "ద బాస్".. ఇక్కడి దాకా తీసుకొచ్చాడంటే, గెలిపిస్తాడంతే అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment