దక్షిణాఫ్రికా చేతిలో టెస్ట్ సిరీస్ ఓటమి అనంతరం సారధ్య బాధ్యతలకు గుడ్‌బై చెబుతూ సంచలన ప్రకటన చేసిన విరాట్ కోహ్లి.. తాను తీసుకున్న నిర్ణయం వెనుక గల కారణాన్ని ట్విటర్‌లో పోస్ట్ చేసిన లేఖలో పొందుపరిచాడు. జట్టును సరైన దిశలో నడిపించేందుకు తన వంతు పూర్తి సహకారాన్ని అందించానన్న కోహ్లి.. తన ఏడేళ్ల టెస్ట్ కెప్టెన్సీ కెరీర్‌లో వందకు 120 శాతం కష్టపడ్డానని, అలా చేయలేని పక్షంలో కెప్టెన్ హోదాలో కొనసాగడం కరెక్ట్ కాదని భావిస్తున్నానని అన్నాడు.
ఆశించిన ఫలితాలు రాకపోవడమే ఇందుకు నిదర్శనమని తెలిపాడు. అందుకే కెప్టెన్సీ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నాడు. జట్టు కోసం నిజాయితీగా కష్టపడ్డానని, జట్టుకు కరెక్ట్ కానిది తాను ఎట్టి పరిస్థితుల్లో చేయలేనని, తన నిర్ణయంపై పూర్తి క్లారిటీతో ఉన్నానని లేఖలో పేర్కొన్నాడు.
తన ప్రయాణంలో తోడుగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుతూ.. మాజీ కోచ్ రవిశాస్త్రి, మాజీ కెప్టెన్ ధోనిల పేర్లను ప్రత్యేకంగా ప్రస్తావించాడు. కాగా, 2014లో ధోని నుంచి టెస్ట్ కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన కోహ్లి.. 68 మ్యాచ్‌ల్లో టీమిండియా సారధిగా వ్యవహరించి 40 మ్యాచ్‌ల్లో జట్టును విజేతగా నిలిపాడు. ఈ క్రమంలో ఎన్నో అద్భుత విజయాలు, మరెన్నో రికార్డులు సాధించి, మరే ఇతర భారత కెప్టెన్ సాధించనన్ని టెస్ట్ విజయాలు సాధించాడు.
చదవండి: విరాట్ కోహ్లి సంచలన ప్రకటన.. టెస్ట్ కెప్టెన్సీకి గుడ్‌బై
Comments
Please login to add a commentAdd a comment