టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఓ చెత్త రికార్డును నమోదు చేశాడు. టీ20ల్లో ఇన్నింగ్స్ తొలి బంతికే డకౌటైన రెండో భారత్ ఆటగాడిగా నిలిచాడు. సెయింట్స్ కిట్స్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన రెండో టీ20లో గోల్డన్ డక్‌గా వెనుదిరిగిన రోహిత్.. ఈ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అంతకుముందు భారత యువ ఆటగాడు పృథ్వీ షా శ్రీలంకపై తొలి బంతికే డకౌట్ అయ్యి ఈ చెత్త రికార్డు సాధించాడు. ఇక రోహిత్ శర్మ టీ20ల్లో గోల్డన్ డక్‌గా వెనుదిరిగడం ఇది 8వసారి. అదే విధంగా టీ20ల్లో గోల్డన్ డకౌట్ అయిన రెండో భారత కెప్టెన్‌గా కూడా రోహిత్ నిలిచాడు.
అంతకుమందు శ్రీలంక సిరీస్‌లో కెప్టెన్‌గా వ్యవహరించిన టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ గోల్డన్ డకౌట్ అయ్యాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. భారత్‌పై వెస్టిండీస్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రస్తుతం 1-1తో సమమైంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 19.2 ఓవర్లలో 138 పరుగులకు ఆలౌటైంది.
విండీస్ పేసర్ ఒబెడ్ మెక్‌కాయ్ 6 వికెట్లు పడగొట్టి భారత పతనాన్ని శాసించాడు. అతడితో పాటు హోల్డర్ రెండు వికెట్లు, జోసఫ్, హోసెన్ తలా వికెట్ సాధించారు. ఇక భారత బ్యాటర్లలో హార్ధిక్ పాండ్యా 31 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం 139 పరుగుల లక్క్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. విండీస్ బ్యాటర్లలో బ్రాండన్ కింగ్(68), థామస్(31) పరుగులతో రాణించారు. టీమిండియా బౌలర్లలో జడేజా, హార్దిక్ పాండ్యా, అవేష్ ఖాన్, అర్షదీప్ సింగ్,అశ్విన్ తలా వికెట్ సాధించారు. ఇరుజట్ల మధ్య మూడో టి20 మంగళవారం(ఆగస్టు 2న) జరగనుంది.
Early tumble of wickets for India, a product of their aggression against the new ball. Can they rebuild?
— FanCode (@FanCode) August 1, 2022
Watch all the action from the India tour of West Indies LIVE, only on #FanCode 👉 https://t.co/RCdQk12YsM@BCCI @windiescricket #WIvIND #INDvsWIonFanCode #INDvsWI pic.twitter.com/zPNAo0P91d
చదవండి: IND vs WI 2nd T20 Highlights: బెంబేలెత్తించిన విండీస్ బౌలర్.. టీమిండియా ఓటమి
Comments
Please login to add a commentAdd a comment