ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్‌కప్‌లో టీమిండియా ఛాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు 17 ఏళ్ల తర్వాత పొట్టి ఫార్మాట్‌లో రెండోసారి జగజ్జేతగా నిలిచింది. ఈ గెలుపుతో భారత్ 11 ఏళ్ల సుదీర్ఘణ అనంతరం ఓ ఐసీసీ ట్రోఫీ గెలిచింది. భారత జట్టు చివరిగా 2013లో ఐసీసీఛాంపియన్స్ ట్రోఫీ సాధించింది. మళ్లీ ఇన్నాళ్లకు టీమిండియా రోహిత్ నేతృత్వంలో ఐసీసీ ట్రోఫీ కైవసం చేసుకుంది.
టీ20 వరల్డ్‌కప్ గెలవడంతో భారత క్రికెట్ అభిమానుల ఆనందానికి అవథుల్లేకుండా పోయాయి. భారత్ ట్రోఫీ గెలిచి రెండు వారాలు గడిచినా విజయోత్సవ సంబురాలు ఇంకా జరుగతూనే ఉన్నాయి. తాజాగా భారత విజయానికి సంబంధించి కోల్‌కతాలో వేడుక జరిగింది. ఇందులో ముఖ్య అతిథిగా టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ హాజయర్యాడు.
ఈ సందర్భంగా గంగూలీ.. టీమిండియాను ప్రశంసలతో ముంచెత్తాడు. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మను ఆకాశానికెత్తాడు. దాదా రోహిత్ గురించి మాట్లాడుతూ.. కోహ్లి కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత రోహిత్‌ను కెప్టెన్ చేసింది నేనే. అప్పుడు నన్ను చాలామంది విమర్శించారు. ఇప్పుడు రోహిత్ సారథ్యంలో టీమిండియా వరల్డ్‌కప్ గెలవడంతో నన్నెవరూ నిందించడం లేదు. అయితే రోహిత్‌ను కెప్టెన్ చేసింది నేనే అన్న విషయాన్ని మాత్రం అందరూ మరిచిపోయారని సరదాగా అన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment