Manoj Tiwary: టీమిండియా తదుపరి కెప్టెన్ ఎవరనే అంశంపై బెంగాల్ క్రీడా మంత్రి, మాజీ టీమిండియా క్రికెటర్ మనోజ్ తివారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మ తర్వాత భారత జట్టు(పరిమిత ఓవర్లు) పగ్గాలు చేపట్టే అర్హత హార్ధిక్ పాండ్యాకు మాత్రమే ఉందని సంచలన కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం టీమిండియా వైస్ కెప్టెన్‌గా ఉన్న కేఎల్ రాహుల్‌కు కాని, భవిష్యత్తు టీమిండియా కెప్టెన్‌గా ఫోకస్ అవుతున్న రిషబ్ పంత్‌కు కాని సారధ్య బాధ్యతలు దక్కే అవకాశం లేదని, ప్రస్తుత ఐపీఎల్‌లో కెప్టెన్‌గానే కాకుండా ఆటగాడి గానూ అద్భుతంగా రాణిస్తున్న హార్ధిక్ పాండ్యాకే మెరుగైన అవకాశాలు ఉన్నాయని కీలక వ్యాఖ్యలు చేశాడు.
రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో హార్ధిక్ ఆల్‌రౌండ్ పెర్ఫార్మెన్స్ (87, వికెట్)తో చెలరేగడాన్ని ఇందుకు ఉదహరిస్తూ ప్రశంసల వర్షం కురిపించాడు. మున్ముందు హార్ధిక్ బ్యాట్‌తోనే కాకుండా బంతితోనూ సంచలన ప్రదర్శనలు నమోదు చేస్తాడని, గుజరాత్ కెప్టెన్‌గా అతని వ్యూహాలు అద్భుతంగా ఉన్నాయని, ఈ లక్షణాలే అతన్ని రోహిత్ శర్మ తర్వాత టీమిండియా కెప్టెన్‌ను చేస్తాయని జోస్యం చెప్పాడు. మొత్తంగా ఐపీఎల్‌లో హార్ధిక్ ప్రదర్శనకు ఫిదా అయ్యానని ట్విటర్ వేదికగా గుజరాత్ కెప్టెన్‌ను ఆకాశానికెత్తాడు. కాగా, ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ వరుస విజయాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌ల్లో 4 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని ఆక్రమించింది.
చదవండి: IPL 2022: ఊపిరి పీల్చుకున్న ఢిల్లీ క్యాపిటల్స్.. ఆటగాళ్లంతా సేఫ్..!
Comments
Please login to add a commentAdd a comment