కేఎల్ రాహుల్(PC: BCCI)
KL Rahul-Team India: టీమిండియా వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్‌ను గత కొంతకాలంగా ఫిట్‌నెస్ సమస్యలు వేధిస్తున్నాయి. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాల్సిన ఈ కర్ణాటక బ్యాటర్.. గాయం కారణంగా ఆఖరి నిమిషంలో తప్పుకొన్నాడు. ఆ తర్వాత స్పోర్ట్స్ హెర్నియా సర్జరీ.. వెస్టిండీస్ పర్యటనతో పునరాగమనం చేస్తాడనుకుంటే కోవిడ్-19 బారిన పడ్డాడు.
ఇక కరోనా నుంచి కోలుకున్నా ఇంకొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని బీసీసీఐ వైద్య బృందం సూచించడంతో సిరీస్ మొత్తానికి దూరమైన పరిస్థితి. అయితే, ఆసియా కప్-2022 టోర్నీ ఆరంభ సమయానికి అతడు జట్టుతో చేరే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. రాహుల్ గైర్హాజరీలో రిషభ్ పంత్, సూర్యకుమార్ యాదవ్ తదితరులు ఓపెనర్లుగా బరిలోకి దిగారు. సాధారణంగా నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగే సూర్య.. విండీస్‌తో మూడో టీ20లో అద్భుత అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు. తద్వారా తాను ఓపెనర్‌గా కూడా రాణించగలడని నిరూపించుకున్నాడు.
నిజంగా మనకు కేఎల్ రాహుల్ అవసరమా?
ఈ పరిణామాల నేపథ్యంలో న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ స్కాట్ స్టైరిస్.. జట్టులో కేఎల్ రాహుల్ స్థానం గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ మేరకు స్పోర్ట్స్18తో అతడు మాట్లాడుతూ.. ‘‘రాహుల్ గాయపడిన కారణంగా జట్టుకు కొన్నాళ్ల పాటు దూరమయ్యాడు. ఆ సమయంలో సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్ రాణించారు. సూర్య అయితే అదరగొట్టాడు.
సూర్యకుమార్ యాదవ్(PC: BCCI)
వీళ్లు తమ ప్రదర్శనతో సెలక్టర్లకు సవాల్ విసురుతున్నారు. నిజంగా మనకు కేఎల్ రాహుల్ అవసరమా? ఒకవేళ అతడు తిరిగి జట్టులోకి వచ్చినా ఫామ్‌ను కొనసాగిస్తాడా? అన్న సందేహాలు రేకెత్తిస్తున్నారు. నిజానికి రాహుల్ మ్యాచ్‌లు ఆడి చాలా రోజులైంది.
ఇలాంటి ప్రశ్నలు తలెత్తేలా అతడే అవకాశం ఇచ్చాడు’’ అని చెప్పుకొచ్చాడు. ఆటగాళ్లు సాధారణంగా తమ స్థానంలో ఇంకొకరికి ఆడే అవకాశం ఇవ్వాలనుకోరు.. కానీ ఇక్కడ రాహుల్ పదే పదే ఇతరులకు ఆ ఛాన్స్ ఇస్తున్నాడని వ్యాఖ్యానించాడు. యువకుల నుంచి తీవ్రమైన పోటీ నెలకొన్న నేపథ్యంలో ఫిట్‌నెస్ కాపాడుకోవాలని సూచించాడు.
ఇక టీ20 ప్రపంచకప్-2022 టోర్నీ సమీపిస్తున్న తరుణంలో ఆసియా కప్-2022 భారత ఆటగాళ్లకు మరింత కీలకంగా మారింది. ఇంగ్లండ్, వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌లలో రాణించిన ఆటగాళ్లు ఆసియా కప్ బెర్తును దాదాపుగా ఖరారు చేసుకున్నట్లే!
ఆగష్టు 27 నుంచి ఆరంభం కానున్న ఈ మెగా ఈవెంట్‌లో ప్రతిభ నిరూపించుకుంటే.. ప్రపంచకప్ జట్టులోనూ చోటు దక్కించుకునే అవకాశం ఉంటుంది. ఆసియా కప్ తర్వాత సెప్టెంబరులో టీమిండియా స్వదేశంలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌లు ఆడనుంది. ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియా వేదికగా అక్టోబరు 16 నుంచి టీ20 వరల్డ్‌కప్ టోర్నీ ఆరంభం కానుంది.
చదవండి: Asia Cup 2022: 'గతేడాది పాక్ చేతిలో ఓటమి భారత్‌ను బాగా డ్యామేజ్ చేసింది.. ఈ సారి మాత్రం'
Comments
Please login to add a commentAdd a comment