కర్టసీ: ఐపీఎల్/ బీసీసీఐ
చెన్నై: ఐపీఎల్‌లో ఐదు సార్లు చాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ ఈ సీజన్‌ను పరాజయంతో ఆరంభించిన సంగతి తెలిసిందే. ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో ఆఖరిబంతి వరకు ఇరుజట్ల మధ్య విజయం దోబుచులాడగా.. చివరకు కోహ్లి సేన విజయం దక్కించుకుంది. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా బౌలర్ మార్కో జాన్సన్ తన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. 4 ఓవర్లు వేసిన జాన్సన్ 28 పరుగులిచ్చి 2 కీలక వికెట్లు తీశాడు. అందులో హిట్టర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్‌తో పాటు షాబాజ్ అహ్మద్ వికెట్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కివీస్ మాజీ ఆల్‌రౌండర్ స్కాట్ స్టైరిస్ మార్కో జాన్సన్ గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు.
'ముంబై ఇండియన్స్ తరపున జాన్సన్ మంచి ప్రదర్శనను కనబరిచాడు. మ్యాచ్ మొత్తం మీద చూసుకుంటే రెండు కీలక వికెట్లు తీశాడు. 6 ఫీట్ల పొడవున్న అతను మంచి టైమ్‌లైన్‌తో బౌలింగ్ వేస్తున్నాడు. అలాగే ఆ మ్యాచ్‌లో ఒక బంతిని దాదాపు 143 కిమీ వేగంతో విసిరాడు. అతని హైట్ అతనికి ప్లస్ కావడంతో పాటు మంచి బౌన్స్ రాబట్టే అవకాశం ఉంది. అతనికి ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్ చాన్స్ ఇచ్చినా అది సరైనది కాదని నాకు అనిపిస్తుంది. వాస్తవానికి వచ్చే ఏడాది ఐపీఎల్ మెగావేలం నిర్వహించనున్నారు. ఈ వేలంలో మార్కో జాన్సన్‌ను వదులుకునే అవకాశం ఉంది. మంచి ఆటగాళ్లను దక్కించుకునేటప్పుడు జాన్సన్‌ను విడిచిపెట్టే అవకాశాలు ఉన్నాయి. అందుకే వచ్చే ఏడాదికి వేలంలో అతన్ని రిలీజ్ చేయకుండా రిజర్వ్‌లో ఉంచుకుంటే బాగుంటుందనేది నా అభిప్రాయం. అలా చేస్తే మలింగ లాగే ముంబై ఇండియన్స్‌కు జాన్సన్ కీలక బౌలర్‌గా మారే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అని చెప్పుకొచ్చాడు. కాగా నేడు ముంబై ఇండియన్స్ తమ రెండో మ్యాచ్‌లో కేకేఆర్‌ను ఎదుర్కోనుంది.
చదవండి: డీకాక్‌ను వేసుకుంటారా.. లిన్‌కే చాన్స్ ఇస్తారా?
Comments
Please login to add a commentAdd a comment