తిరువనంతపురం:భారత్ తో జరిగిన వన్డే, ట్వంటీ 20 సిరీస్ లను కోల్పవడానికి ప్రధాన కారణం పేసర్ జస్ఫ్రిత్ బూమ్రానే అంటున్నాడు న్యూజిలాండ్ మాజీ ఆల్ రౌండర్ స్కాట్ స్టైరిస్. ఒకవేళ భారత జట్టులో బూమ్రా లేకపోతే రెండు సిరీస్ లను 2-1 తో న్యూజిలాండ్ గెలిచేదని స్టైరిస్ అభిప్రాయపడ్డాడు.
' మాతో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్ లో బూమ్రా ఆడకుంటే ఫలితం మరొలా ఉండేది. డెత్ ఓవర్ల స్పెషలిస్టుగా పేరుగాంచిన బూమ్రా.. న్యూజిలాండ్ నుంచి సిరీస్ ను లాగేసుకున్నాడు'అని ఈ సిరీస్ కు వ్యాఖ్యాతగా వ్యహరించిన స్టైరిస్ పేర్కొన్నాడు. టీ 20 సిరీస్ లో బూమ్రా తొమ్మిది వికెట్ల రాణించి మ్యాన్ ఆఫ్ ద సిరీస్ గా ఎంపికయ్యాడు. ఆఖరి ట్వంటీ 20లో తన చివరి రెండు ఓవర్లను పూర్తి చేసే క్రమంలో బూమ్రా 2/9 తో ఆకట్టుకున్నాడు. అంతకుముందు జరిగిన వన్డే సిరీస్ లో భాగంగా ఆఖరి వన్డేలో భారత్ ఆరు పరుగులతో విజయం సాధించింది. దాంతో సిరీస్ ను 2-1 తో కైవసం చేసుకుంది. ఆ మ్యాచ్ లో బూమ్రా మూడు వికెట్లతో ఆకట్టుకున్నాడు. మార్టిన్ గప్టిల్, రాస్ టేలర్, పించ్ హిట్టర్ మిచెల్ సాంట్నార్ వికెట్లను ఖాతాలో వేసుకుని విజయంలో పాలు పంచుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment