శివం దూబే (PC: BCCI)
Ranji Trophy 2023-24: ముంబై తాత్కాలిక కెప్టెన్ శివం దూబే జట్టుకు దూరమయ్యాడు. కండరాల నొప్పితో బాధపడుతున్న అతడికి సెలక్టర్లు విశ్రాంతినిచ్చారు. కాగా అఫ్గనిస్తాన్‌తో టీమిండియా టీ20 సిరీస్ ముగించుకున్న తర్వాత ఆల్‌రౌండర్ శివం దూబే ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌పై దృష్టి పెట్టాడు.
పరిమిత ఓవర్ల క్రికెట్‌తో పాటు టీమిండియా టెస్టు రేసులోనూ అదృష్టం పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యాడు. ఇందులో భాగంగా ముంబై తరఫున రంజీ ట్రోఫీ 2023-24 సీజన్ బరిలో దిగాడు. ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్‌లలో రెండు హాఫ్ సెంచరీలతో పాటు ఓ శతకం(117) బాదాడు. బౌలింగ్‌లోనూ ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు.
బెంగాల్‌తో మ్యాచ్‌లో కెప్టెన్‌గా హిట్
ఈ క్రమంలో అజింక్య రహానే గైర్హాజరీలో ఆఖరిగా ముంబై ఆడిన మ్యాచ్‌లో కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం దక్కించుకున్నాడు. బెంగాల్‌తో ఆదివారం ముగిసిన ఈ మ్యాచ్‌లో దూబే 72 పరుగులు సాధించాడు.
అదే విధంగా రెండు వికెట్లు కూడా తీసి ముంబై విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే, బెంగాల్‌తో మ్యాచ్ సందర్భంగా శివం దూబే కండరాలు పట్టేసినట్లు సమాచారం. ఈ విషయం గురించి ముంబై చీఫ్ సెలక్టర్ రాజు కులకర్ణి మాట్లాడుతూ.. ముందు జాగ్రత్త చర్యలో భాగంగానే దూబేకు రెస్ట్ ఇచ్చినట్లు తెలిపాడు.
శార్దూల్ ఠాకూర్ ఎంట్రీ
నాకౌట్ మ్యాచ్‌ల సమయానికి అతడు అందుబాటులోకి వస్తాడని తెలిపాడు. ఇదిలా ఉంటే.. టీమిండియా ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ ముంబై తరఫున రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. సౌతాఫ్రికా టూర్‌లో గాయపడిన అతడు రంజీ బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. ఫిబ్రవరి 9 నుంచి ఛత్తీస్‌గఢ్‌తో మ్యాచ్‌కు కెప్టెన్ అజింక్య రహానే తిరిగి జట్టుతో చేరనున్నాడు.
చదవండి: అరిచీ.. అరిచీ.. నా గొంతు పోయింది: రోహిత్ శర్మ వ్యాఖ్యలు వైరల్
Comments
Please login to add a commentAdd a comment