
డబ్ల్యూటీసీ ఫైనల్‌తో రీ ఎంట్రీ ఇచ్చి అదరగొట్టిన టీమిండియా వెటరన్ ఆటగాడు అజింక్యా రహానే.. ఆ తర్వాతి మ్యాచ్‌ల్లో మాత్రం తీవ్ర నిరాశరుస్తున్నాడు. ప్రస్తుతం వెస్టిండీస్‌తో జరగుతున్న టెస్టు సిరీస్‌లో రహానే దారుణ ప్రదర్శన కనబరుస్తున్నాడు. తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లు కలిపి 11 పరుగులు మాత్రమే చేసిన రహానే.. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో కూడా కేవలం 8 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు.
ఈ సిరీస్‌లో వైస్ కెప్టెన్ రహానే తన స్ధాయికి తగ్గప్రదర్శన చేయలేకపోతున్నాడు. ఈ నేపథ్యంలో రహానేపై భారత మాజీ ఓపెనర్ వసీం జాఫర్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. టెస్టు క్రికెట్‌లో రహానే మరింత నిలకడగా రాణిస్తే రోహిత్ తర్వాత భారత జట్టు సారధి అయ్యే అవకాశం ఉందని జాఫర్ అభిప్రాయపడ్డాడు.
"రహానే దాదాపు రెండేళ్ల తర్వాత జట్టులోకి వచ్చాడు. అతడు తన ఆటలో మరింత నిలకడ ప్రదర్శించాల్సిన సమయం ఇది. అతడి కెరీర్‌లో నిలకడలేమి ప్రధాన సమస్యంగా ఉంది. అతడు దానికి కచ్చితంగా అధిగమించాలి. ఎందుకంటే రోహిత్ శర్మ తర్వాత టెస్టుల్లో టీమిండియా కెప్టెన్ అయ్యే ఛాన్స్ ఉంది.
అతడికి గతంలో కెప్టెన్‌గా పనిచేసిన అనుభవం కూడా ఉంది. ముఖ్యంగా ఆస్ట్రేలియాలో జరిగిన టెస్టు సిరీస్‌ను అతడి సారధ్యంలోని భారత జట్టు ఎ విధంగా సొంతం చేసుకుందో మనందరికి తెలుసు. ప్రస్తుతం రోహిత్ తర్వాత కెప్టెన్‌గా అతడే మంచి ఎంపిక" అని జియో సినిమాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జాఫర్ పేర్కొన్నాడు.
చదవండి: IND vs BAN: కోపంతో ఊగిపోయిన టీమిండియా కెప్టెన్.. బ్యాట్‌తో వికెట్లను కొట్టి! వీడియో వైరల్