
లండన్‌లోని ఓవల్ వేదికగా ఈ ఏడాది జూన్ 7 నుంచి ఆస్ట్రేలియాతో జరుగనున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కోసం భారత జట్టును ఇవాళ (ఏప్రిల్ 25) ప్రకటించారు. ఇటీవల ఆస్ట్రేలియా ఆడిన జట్టునే దాదాపుగా కొనసాగించిన సెలెక్టర్లు.. ఒక్క అనూహ్య మార్పు చేశారు. గాయపడిన శ్రేయస్ అయ్యర్ స్థానంలో ఐపీఎల్-2023లో ఇరగదీస్తున్న టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ వెటరన్ బ్యాటర్ అజింక్య రహానేను ఎంపిక చేశారు. కేకేఆర్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్‌కు మరో అవకాశం ఇచ్చారు.
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23 ఫైనల్‌కు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, పుజారా, విరాట్ కోహ్లి, అజింక్య రహానే, కేఎల్ రాహుల్, కేఎస్ భరత్, అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, సిరాజ్, ఉమేశ్ యాదవ్, ఉనద్కత్
Comments
Please login to add a commentAdd a comment