రాణించిన రహానే.. అరంగేట్రం అదుర్స్‌ | England Domestic One Day Cup 2024: Ajinkya Rahane Slams Blasting Fifty On Leicestershire Debut | Sakshi
Sakshi News home page

రాణించిన రహానే.. అరంగేట్రం అదుర్స్‌

Published Thu, Jul 25 2024 9:35 AM | Last Updated on Thu, Jul 25 2024 10:09 AM

England Domestic One Day Cup 2024: Ajinkya Rahane Slams Blasting Fifty On Leicestershire Debut

ఇంగ్లండ్‌ దేశవాలీ వన్డే కప్‌లో టీమిండియా వెటరన్‌ ఆటగాడు అజింక్య రహానే సత్తా చాటాడు. ఈ టోర్నీలో లీసెస్టర్‌షైర్‌ తరఫున అరంగేట్రం చేసిన రహానే.. నిన్న (జులై 24) నాటింగ్హషైర్‌తో జరిగిన మ్యాచ్‌లో మెరుపు అర్ద సెంచరీతో (60 బంతుల్లో 71; 9 ఫోర్లు) ఆకట్టుకున్నాడు. రహానే క్లాసీ ఇన్నింగ్స్‌కు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది.

ఈ మ్యాచ్‌లో నాటింగ్హమ్‌షైర్‌పై లీసెస్టర్‌షైర్‌ 15 పరుగుల తేడాతో (డక​్‌వర్త్‌ లూయిస్‌) విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన లీసెస్టర్‌.. బుడింగర్‌ (75), హిల్‌ (81), రహానే అర్ద సెంచరీలతో రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 369 పరుగులు చేసింది.

అనంతరం వరుణుడు అడ్డుతగలడంతో డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతిన లీసెస్టర్‌ లక్ష్యాన్ని 14 ఓవర్లలో 105 పరుగులకు కుదించారు. ఈ లక్ష్యాన్ని ఛేదించలేక లీసెస్టర్‌ ఓటమిపాలైంది. 14 ఓవర్లలో ఆ జట్టు 6 వికెట్లు కోల్పోయి 89 పరుగులు మాత్రమే చేయగలిగింది. టామ్‌ స్క్రీవెన్‌ 3 వికెట్లు తీసి లీసెస్టర్‌ను దెబ్బ తీశాడు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement