
PC: IPL Twitter
టీమిండియా వెటరన్ బ్యాటర్ అజింక్య రహానే ఇవాళ (జూన్ 6) 35వ పడిలోకి అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా బీసీసీఐ అతనికి ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది. టీమిండియాకు రహానే కాంట్రిబ్యూషన్‌ను అంకెల రూపంలో (192 అంతర్జాతీయ మ్యాచ్‌లు, 8268 పరుగులు, 15 సెంచరీలు) తెలియజేస్తూ ఓ ట్వీట్ చేసింది.
అంతర్జాతీయ క్రికెట్‌లోకి జింక్స్ రీఎంట్రీ..
వయసు పైబడటం, ఆటలో వేగం లేకపోవడం, ఫామ్ కోల్పోవడం, యువ ఆటగాళ్ల ఎంట్రీతో అవకాశాలు రాకపోవడం వంటి వివిధ కారణాల చేత దాదాపుగా రిటైర్మెంట్ ప్రకటించే స్టేజ్ వరకు వెళ్లిన జింక్స్ (రహానే ముద్దు పేరు).. ఐపీఎల్-2023తో అనూహ్యంగా ఫ్రేమ్‌లోకి వచ్చాడు. ఎవరో గాయపడటంతో సీఎస్‌కేలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముంబైకర్.. అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని, ఏకంగా టీమిండియా టెస్ట్ జట్టులో స్థానం దక్కించుకున్నాడు.
1️⃣9️⃣2️⃣ intl. matches
— BCCI (@BCCI) June 6, 2023
8️⃣2️⃣6️⃣8️⃣ intl. runs
1️⃣5️⃣ intl. centuries 💯
Here's wishing @ajinkyarahane88 a very happy birthday. 🎂👏🏻
#TeamIndia pic.twitter.com/162jbQlk2z
అంతే కాకుండా కేఎల్ రాహుల్ గాయపడటంతో డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత తుది జట్టులో కూడా చోటు కన్ఫర్మ్ చేసుకున్నాడు. 2022 జనవరిలో సౌతాఫ్రికాలో తన చివరి టెస్ట్ మ్యాచ్ ఆడిన జింక్స్.. దాదాపు ఏడాదిన్నర తర్వాత టీమిండియాలోకి పునరాగమనం చేయనున్నాడు.
ఐపీఎల్ 2023లో రహానే 2.0..
ఐపీఎల్ 2023లో ఆడే అవకాశాన్ని అనూహ్య పరిణామాల మధ్య దక్కించుకున్న జింక్స్.. ఈ సీజన్‌లో తనలోని కొత్త యాంగిల్‌ను ప్రేక్షకులకు పరిచయం చేశాడు. రహానే 2.0గా ఫ్యాన్స్‌ను మెప్పించాడు. జిడ్డు బ్యాటర్ అన్న అపవాదును చెరిపివేస్తూ.. మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడి ప్రేక్షకులకు వినోదాన్ని పంచడంతో పాటు తన జట్టులో విజయాల్లో కీలకపాత్ర పోషించాడు.
ఈ సీజన్ మొత్తం ఎదురుదాడే లక్ష్యంగా బరిలోకి దిగిన జింక్స్.. 11 ఇన్నింగ్స్‌ల్లో 172.49 స్ట్రయిక్‌రేట్‌తో 2 అర్ధసెంచరీల సాయంతో 326 పరుగులు చేశాడు. ఈ ప్రదర్శన ఆధారంగానే అతను టెస్ట్ జట్టులో చోటు కొట్టేశాడు. ఐపీఎల్ 2023తో బజ్ గేమ్ మొదలెట్టిన రహానే ఇదే ప్రదర్శనను డబ్ల్యూటీసీ ఫైనల్లో కూడా కొనసాగించాలని అభిమానులు కోరుకుంటున్నారు.
చదవండి: WTC Final: రోహిత్ శర్మకు గాయం..? టీమిండియా అభిమానుల ఆందోళన