WTC Finals: Fans Says Ajinkya Rahane Better Choice If Rohit Removed From Test Captaincy - Sakshi
Sakshi News home page

#TestCaptaincy: రోహిత్‌ను తొలగిస్తే!.. భారత కొత్త టెస్టు కెప్టెన్‌ ఎవరంటే?

Published Sun, Jun 11 2023 9:00 PM | Last Updated on Mon, Jun 12 2023 12:10 PM

Fans Says Ajinkya-Rahane Better Choice If Rohit Removed-Test Captaincy - Sakshi

డబ్ల్యూటీసీ ఫైనల్‌లో టీమిండియాను విజేతగా నిలపడంలో విఫలమైన కెప్టెన్‌ రోహిత్‌ శర్మపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టెస్టుల్లో రోహిత్‌ కెప్టెన్‌గా పనికిరాడని.. అతన్ని కెప్టెన్సీ నుంచి తొలగించడం మంచిదని అభిప్రాయపడుతున్నారు. కెప్టెన్‌గా టెస్టు సిరీస్‌లు గెలిచినప్పటికి ప్రతిష్టాత్మక డబ్ల్యూటీసీ ఫైనల్స్‌లో జట్టును నడిపించడంలో విఫలం కావడంతోనే రోహిత్‌ను తప్పించాలనే డిమాండ్‌ ఎక్కవగా వినిపిస్తోంది.

ఒకవేళ ఇప్పటికిప్పుడు రోహిత్‌ శర్మను టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పిస్తే ప్రత్యామ్నాయం ఎవరనే దానికి ఎక్కువగా వినిపిస్తున్న పేరు అజింక్యా రహానే. 512 రోజుల విరామం తర్వాత టెస్టు మ్యాచ్‌ ఆడిన రహానే అందరికంటే మంచి ప్రదర్శన చేశాడు. అసలు రహానే లేకపోయుంటే డబ్ల్యూటీసీ ఫైనల్‌ మూడు రోజుల్లోనే ముగిసిపోయేది. తొలి ఇన్నింగ్స్‌లో అతను ఆడిన 89 పరుగుల ఇన్నింగ్స్‌ టీమిండియా పరువు కాపాడడంతో పాటు మ్యాచ్‌ ఐదురోజులు జరగడానికి కారణమయ్యాడు.

ఇక రోహిత్‌ స్థానంలో రహానే టీమిండియా టెస్టు కెప్టెన్‌గా సరైనోడని చాలా మంది పేర్కొంటున్నారు. ఇందుకు కారణం లేకపోలేదు. 2020-21లో టీమిండియా ఆస్ట్రేలియాలో పర్యటించింది. తొలి టెస్టు ఓటమి అనంతరం అప్పటి రెగ్యులర్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి పెటర్నిటీ లీవ్స్‌ పేరిట స్వదేశానికి వచ్చేశాడు. దీంతో వైస్‌ కెప్టెన్‌గా ఉ‍న్న రహానే.. తాత్కాలిక కెప్టెన్‌గా జట్టును నడిపించాడు. నడిపించడమే కాదు అటు బ్యాటర్‌గా.. ఇటు కెప్టెన్‌గా సూపర్‌ సక్సెస్‌ అయ్యాడు.

మెల్‌బోర్న్‌ టెస్టులో టీమిండియా గెలవడంలో రహానే పాత్ర కీలకం. కెప్టెన్‌గా అతని తీసుకున్న నిర్ణయాలతో పాటు బ్యాటింగ్‌లో సెంచరీతో మెరవడంతో భారత్‌ రెండో టెస్టు గెలిచింది. ఇక సిడ్నీ వేదికగా జరిగిన మూడో టెస్టును డ్రా చేసుకున్న టీమిండియా.. గబ్బా వేదికగా జరిగిన చివరి టెస్టులో చారిత్రాత్మక విజయంతో పాటు 2-1తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. దీంతో భవిష్యత్తు కెప్టెన్‌గా రహానే పేరు మార్మోగిపోయింది.

ఇప్పుడు రోహిత్‌ టెస్టు కెప్టెన్‌గా తరచూ విఫలం అవుతుండడంతో అతని స్థానంలో రహానే అయితేనే కరెక్ట్‌ అని చాలా మంది భావిస్తున్నారు. రహానేలో నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని.. జట్టు ఓటమి దిశగా ఉన్నప్పుడు సమయస్పూర్తితో వ్యవహరించి మ్యాచ్‌ను గాడిన పెట్టడం రహానేకున్న సమర్థత అని క్రీడా పండితులు పేర్కొంటున్నారు.  ఇప్పుడు కాకపోయినా రోహిత్‌ తర్వాతి టెస్టు కెప్టెన్‌ అజింక్యా రహానేనే అవుతాడని అభిమానులు బల్ల గుద్ది చెబుతున్నారు. 

చదవండి: #RetireRohit: 'కెప్టెన్‌గా దిగిపో.. కాదంటే రిటైర్‌ అయిపో'

WTC Final 2023: 21వ శతాబ్దం మొత్తంలో ఈ ఆసీస్‌ బౌలర్‌ను మించినోడే లేడు


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement