ఐపీఎల్-2025 మెగా వేలంలో టీమిండియా స్టార్ ప్లేయర్లు అజింక్య రహానే, పృథ్వీ షా, మయాంక్ అగర్వాల్, శ్రీకర్ భరత్‌లకు భారీ షాక్ తగిలింది. రెండో రోజు వేలంలోకి వచ్చిన ఈ ఆటగాళ్లను కొనుగొలు చేసేందుకు ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపలేదు.
ముఖ్యంగా ఐపీఎల్‌లో స్పెషలిస్ట్ ఓపెనర్‌గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న పృథ్వీ షాను కూడా ఫ్రాంచైజీలు పట్టించుకోకపోవడం గమనార్హం. అయితే షా ప్రస్తుతం పేలవ ఫామ్, ఫిట్‌నెస్ సమస్యలతో బాధపడుతున్నాడు.
ఈ కారణంగానే అతడిని ఎవరూ పట్టించుకోలేదన్నది తేట తెల్లమవుతోంది. మరోవైపు గత కొన్ని సీజన్లలో సీఎస్‌కే తరపున అకట్టుకున్న రహానేకు కూడా మొండి చేయి ఎదురైంది. కోటిన్నర బేస్ ధరతో వేలంలోకి అడుగుపెట్టిన రహానే ఎవరూ కొనుగోలు చేయలేదు. వేలంలో అమ్ముడుపోని మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ కనీస ధర కోటిగా ఉంది.
శార్ధూల్‌ది అదే కథ..
వీరితో పాటు స్టార్ ఆల్‌రౌండర్ శార్ధూల్ ఠాకూర్‌కు కూడా నిరాశే ఎదురైంది. రూ. 2 కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చిన శార్ధూల్‌ను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేసేందుకు ముందకు రాలేదు. గాయం కారణంగా గత కొన్ని నెలలకు దూరంగా ఉన్న శార్ధూల్.. ఇటీవలే తిరిగి మైదానంలో అడగుపెట్టాడు. ప్రస్తుతం సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబైకి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఇక పైన పేర్కొన్న ఆటగాళ్లు సెకెండ్ రౌండ్‌లోనైనా అమ్ముడుపోతారో లేదో వేచి చూడాలి.
చదవండి: అతడి టెస్టు కెరీర్ గొప్పగా సాగుతోంది.. మాకు ఇంతకంటే ఏం కావాలి: బుమ్రా
Comments
Please login to add a commentAdd a comment