ముంబై వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టెస్టులో టీమిండియా 25 పరుగుల తేడాతో ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. విరాట్, రోహిత్ వంటి వరల్డ్ క్లాస్ బ్యాటర్లతో నిండిన భారత్ 147 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక 3-0తో వైట్‌వాష్‌కు గురైంది. బెంగళూరు, పుణేల వేదికగా జరిగిన తొలి రెండు టెస్టుల్లోనూ దారుణ ప్రదర్శన కనబరిచిన భారత జట్టు.. ఇప్పుడు వాంఖడేలోనే అదే తీరును పునరావతృం చేసింది.
కివీస్ స్పిన్నర్ల వలలో చిక్కుకుని భారత బ్యాటర్లు విల్లవిల్లాడారు. ఒక్క రిషబ్ పంత్ మినహా మిగితా అందరూ విఫలమయ్యారు. దీంతో స్వదేశంలో తొలిసారి రెండు కంటే ఎక్కువ మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో వైట్‌వాష్‌కు గురై ఘోర ఆ ప్రతిష్టతను రోహిత్ సేన మూటకట్టుకుంది.
రహానే పోస్ట్ వైరల్..
ఈ నేపథ్యంలో టీమిండియా వెటరన్ ప్లేయర్ అజింక్య రహానే షేర్ చేసిన ఓ వీడియా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భారత్ ఓటమి అనంతరం తను వర్కౌట్ చేస్తున్న వీడియోను తన ఇన్‌స్టా ఖాతాలో రహానే షేర్ చేశాడు.
అందుకు హద్దులను దాటి ముందుకు వెళ్లండి అంటూ ఆర్ధం వచ్చేలా కాప్షన్ ఇచ్చాడు. కాగా రహానే భారత జట్టులో చోటు కోల్పోయి దాదాపు ఏడాదిపైనే అయింది. రహానే జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్నప్పటకి తన ఫిట్‌నెస్‌ను ఏ మాత్రం కోల్పోలేదు.
ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో రహానే బిజీబిజీగా ఉన్నాడు. రంజీ సీజన్ 2024-25లో ముంబై కెప్టెన్‌గా రహానే వ్యవహరిస్తున్నాడు. సారధిగా రహానే గతేడాది ముంబై జట్టును రంజీ చాంపియన్‌గా నిలిపాడు. ఆ తర్వాత ముంబైకు ఇరానీ కప్-2024ను కూడా అందించాడు. రహానే చివరగా భారత్ తరపున గతేడాది వెండీస్‌పై ఆడాడు.
చదవండి: చాలా బాధగా ఉంది.. ఓటములకు నాదే బాధ్యత: రోహిత్ శర్మ
Comments
Please login to add a commentAdd a comment