West Indies vs India, 1st Test: వెస్టిండీస్‌తో తొలి టెస్టులో అరంగేట్రం చేసిన భారత యువ బ్యాటర్ యశస్వి జైశ్వాల్ సెంచరీతో చెలరేగితే.. ఈ మ్యాచ్‌తో టెస్టుల్లో అడుగుపెట్టిన ఇషాన్ కిషన్ మాత్రం ఆకట్టుకోలేకపోయాడు. ఓపెనర్‌గా దిగిన యశస్వి 171 పరుగులు సాధించగా.. వికెట్ కీపర్‌గా జట్టులోకి వచ్చిన ఇషాన్ ఏడో స్థానంలో బ్యాటింగ్ చేశాడు.
సింగిల్ కోసం 20 బంతులు
అయితే, ఒక్క పరుగు తీయడానికి ఏకంగా 20 బంతులు తీసుకున్నాడు. వికెట్ కీపర్‌గానూ తమ మార్కు చూపలేకపోయాడు. ఇలా ఆటతో ఆకట్టుకోలేకపోయిన ఇషాన్ కిషన్.. సీనియర్లను టీజ్ చేసి అభిమానుల ఆగ్రహానికి గురవుతున్నాడు. తొలిరోజు ఆటలో ఏకంగా టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికి సూచనలు ఇచ్చాడు.
మొన్న కోహ్లితో అలా
విండీస్ ఇన్నింగ్స్ సందర్భంగా స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న కోహ్లిని కాస్త పక్కకు జరగమని సూచించాడు. ఇక మూడో రోజు ఆట సందర్భంగా టీమిండియా విజయానికి చేరువవుతున్న తరుణంలో వైస్ కెప్టెన్ అజింక్య రహానేను కించపరిచినట్లుగా మాట్లాడాడు. టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మాయాజాలంలో చిక్కిన విండీస్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టిన విషయం తెలిసిందే.
రహానేను కించపరిచినట్లుగా
విండీస్ రెండో ఇన్నింగ్స్‌లో అశూ ఏకంగా 7 వికెట్లు పడగొట్టగా.. మరో స్పిన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా 2 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో 130 పరుగులకే వెస్టిండీస్ కుప్పకూలింది. అయితే, పదకొండో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన విండీస్ స్పిన్నర్ జోమెల్ వారికన్ జిడ్డు బ్యాటింగ్‌తో టీమిండియా స్పిన్నర్లను కాసేపు ఇబ్బంది పెట్టాడు.
ఏంటీ? ఏమంటున్నావు?
మొత్తంగా 18 బంతులు ఎదుర్కొన్న అతడు 18 పరుగులు చేసి అశ్విన్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఈ నేపథ్యంలో వారికన్ ఇన్నింగ్స్‌ను రహానే ఆటతో పోలుస్తూ.. ‘‘అజ్జూ భయ్యా! ఇతను నీకంటే ఎక్కువ బంతులు ఆడాడు!’’ అంటూ ఇషాన్ కిషన్ .. రహానేతో అన్నాడు. ఇందుకు కాస్త సీరియస్ లుక్ ఇచ్చిన రహానే.. ‘‘ఏంటీ? ఏమంటున్నావు?’’ అని బదులిచ్చాడు.
ఇవే తగ్గించుకుంటే మంచిది
ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో ఇషాన్‌పై అభిమానులు ఫైర్ అవుతున్నారు. ‘‘ఆట తక్కువ! ఓవరాక్షన్ ఎక్కువ.. సీనియర్లతో ఎలా ప్రవర్తించాలో తెలియదా? మొన్న కోహ్లికే ఏదో చెప్పుబోయావు.. ఇప్పుడు రహానేను అవమానపరిచేలా మాట్లాడావు..
ఇలాంటి పిచ్చి పనులు మానేసి ఆటపై దృష్టి పెట్టు’’ అని హితవు పలుకుతున్నారు. కాగా ఈ మ్యాచ్‌లో టీమిండియా వైస్ కెప్టెన్ అజింక్య రహానే పూర్తిగా విఫలమయ్యాడు. 11 బంతులు ఎదుర్కొని 3 పరుగులు మాత్రమే చేయగలిగాడు.
చదవండి: ఒకప్పుడు జట్టులో చోటే దిక్కు లేదు.. ఇప్పుడు ఏకంగా టీమిండియా కెప్టెన్‌గా!
ఒకప్పుడు జట్టులో చోటే దిక్కు లేదు.. ఇప్పుడు ఏకంగా టీమిండియా కెప్టెన్‌గా!
— Nihari Korma (@NihariVsKorma) July 15, 2023
Comments
Please login to add a commentAdd a comment