మహారాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు
ముంబై: భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్‌కు గతంలో కేటాయించిన స్థలాన్ని వెటరన్ బ్యాటర్ అజింక్య రహానేకు బదలాయిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముంబైలోని ఖరీదైన బాంద్రా ప్రాంతంలో 2000 చదరపు మీటర్ల (2391 గజాలు) స్థలాన్ని రహానేకు 30 ఏళ్ల పాటు లీజుకు ఇవ్వాలని మహారాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది.
స్పోర్ట్స్ కాంప్లెక్స్, క్రీడాభివృద్ధి కోసం ఈ స్థలాన్ని వినియోగించాల్సి ఉంటుంది. ఈ స్థలాన్ని 1988లో గావస్కర్‌కు కేటాయించారు. ఇండోర్ క్రికెట్ ట్రెయినింగ్ అకాడమీ కోసం లీజుకు ఇచ్చారు. కానీ 30 ఏళ్లకుపైగా గావస్కర్ ఈ స్థలాన్ని సది్వనియోగం చేయలేదు.
క్రికెట్ అవసరాలకోసం అభివృద్ధి చేయలేదు. ఒక నిర్దిష్ట ప్రయోజనం కోసం కేటాయించిన భూమి నిరుపయోగంగా మారడంపై 2021లోనే ఆ రాష్ట్ర మాజీ గృహనిర్మాణ మంత్రి జితేంద్ర అవ్హద్ విమర్శించారు. దీంతో గావాస్కర్ మరుసటి ఏడాదే (2022) ప్రభుత్వానికి అప్పగించారు. తాజాగా ఈ స్థలానే ఇప్పుడు రహానేకు కేటాయించారు.
Comments
Please login to add a commentAdd a comment