న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాతో త్వరలో ఆరంభమయ్యే ట్వంటీ 20 సిరీస్ కు టీమిండియా ఓపెనర్ అజింక్యా రహానేను ఎంపిక చేయకపోవడంపై దిగ్గజ ఆటగాడు సునీల్ గావస్కర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అసలు ఆసీస్ తో టీ 20 సిరీస్ కు ఏ ప్రామాణికంగా భారత్ జట్టు ఎంపిక జరిగిందో అర్ధం కావడం లేదంటూ మండిపడ్డాడు. ఇటీవల ముగిసిన ఐదు వన్డేల సిరీస్ లో నాలుగు వరుస హాఫ్ సెంచరీలు చేసిన ఒక ఆటగాడ్ని పక్కన పెట్టారంటే సెలక్షన్ కమిటీ తీరు సరిగా లేదనడానికి అద్దం పడుతుందన్నాడు.
'ఆసీస్ తో వన్డే సిరీస్ లో రహానే అమోఘంగా రాణించాడు. వరుసగా నాలుగు హాఫ్ సెంచరీలు చేసి భారత జట్టు సిరీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. మరి అతన్ని ట్వంటీ 20 సిరీస్ కు ఎందుకు ఎంపిక చేయలేదు. మరొకవైపు కేఎల్ రాహుల్ ను టీ 20కి ఎంపిక చేశారు. కేఎల్ రాహుల్ మంచి ఆటగాడే.. కానీ ఐదు వన్డేల సిరీస్ లో ఒక గేమ్ కూడా అతనికి ఆడే అవకాశం ఇవ్వలేదు. అటువంటప్పుడు టీ 20 సిరీస్ కు రాహుల్ జట్టులో ఎందుకు?, అదే సమయంలో నాలుగు హాఫ్ సెంచరీలు చేసిన రహానేపై వేట వేయడానికి కారణంగా ఏమిటి? అని గావస్కర్ ఘాటుగా నిలదీశాడు.
ఆసీస్ తో వన్డే సిరీస్ లో రహానే(5,55,70,53,61) విశేషంగా రాణించిన సంగతి తెలిసిందే. తొలి వన్డే మినహా మిగతా మ్యాచ్ ల్లో రహానే హాఫ్ సెంచరీలతో మెరిశాడు. అయితే ట్వీ 20ల్లో తనపై వేటు వేయడాన్ని మాత్రం రహానే తేలిగ్గా తీసుకున్నాడు. తానెప్పుడూ సెలక్టర్ల నిర్ణయాన్ని గౌరవిస్తానని టీ 20 సిరీస్ తరువాత రహానే పేర్కొన్నాడు. జట్టులో ఎప్పుడూ పోటీ ఉంటేనే ప్రతీ ఒక్కరూ వంద శాతం ప్రదర్శన ఇవ్వడానికి కష్టపడతారని రహానే స్సష్టం చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment