భారత స్టార్ ఆటగాళ్లకు తొలి రెండు మ్యాచ్‌లకు విశ్రాంతి ఇవ్వడంతో ఆ్రస్టేలియాతో తొలి వన్డేలో ఫలితం ఎలా ఉంటుందోనని నాతోపాటు పలువురు ఆందోళన చెందారు. కానీ టీమిండియా సులభంగా విజయం సాధించడంతో సంతోషపడ్డ వారిలో నేనూ ఉన్నాను. ఇక రెండో వన్డేలో ఆ్రస్టేలియా గెలిచి సిరీస్‌ను సమం చేస్తే...రాజ్‌కోట్‌లో జరిగే చివరిదైన మూడో వన్డే మ్యాచ్‌కు స్టార్ ఆటగాళ్లతో భారత్ పూర్తిస్థాయి బలగంతో బరిలోకి దిగుతుంది. రోహిత్, కోహ్లిలాంటి ఇద్దరు అనుభవజు్ఞలైన బ్యాటర్లు లేకపోయినా భారీ లక్ష్యాన్ని ఛేదించే సత్తా తమలో ఉందని తాజా గెలుపుతో కేఎల్ రాహుల్ బృందం నిరూపించింది.
భారత భవిష్యత్‌కు ఢోకా లేదని చాటింది. టి20 తరహాలో కాకుండా నేర్పుగా ఆడి రుతురాజ్ గైక్వాడ్, సూర్యకుమార్ యాదవ్ అర్ధ సెంచరీలు సాధించడం ఆనందం కలిగించింది. గతంలో వారికి కొన్ని అవకాశాలు లభించినా టి20 తరహాలో దూకుడుగా ఆడి తమ వికెట్లను సమర్పించుకున్నారు. కానీ ఈసారి ఈ ఇద్దరూ సంయమనంతో ఆడి అలరించారు. శుబ్‌మన్ గిల్ తన అద్భుత ఫామ్‌ను కొనసాగించాడు. సొంత మైదానంలో తొలి అంతర్జాతీయ సెంచరీ సాధిస్తాడనుకున్న దశలో అవుటవ్వడం నిరాశ కలిగించింది.
మొహమ్మద్ షమీ బంతితో నిప్పులు చెరగడం ఆకట్టుకుంది. దాంతో కోచ్, కెపె్టన్ తుది జాబితాలో ముగ్గురు పేసర్లను ఆడించే విషయాన్ని తీవ్రంగా ఆలోచిస్తారు. వికెట్లు తీసే బౌలర్లను ఆడిస్తే వారు ప్రత్యర్థి బ్యాటర్లు తొందరగా పరుగులు చేయకుండా నియంత్రిస్తారు. సమష్టి ఆటతీరుతో ఆకట్టుకోవడంతో సమీపంలో భారత క్రికెట్ మరిన్ని గొప్ప విజయాలు సాధిస్తుందనే నమ్మకం పెరిగింది.
Comments
Please login to add a commentAdd a comment