టీమిండియా వెటరన్ క్రికెటర్ అజింక్యా రహానే జాతీయ జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు అన్ని దారులు మూసుకుపోయాయి. రంజీ ట్రోఫీ సీజన్ 2023-24 సీజన్‌లో రాణించి భారత జట్టులో మళ్లీ చోటు సంపాదించుకోవాలని భావించిన రహానే.. అందుకు తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. సీజన్ ఆసాంతం కెప్టెన్‌గా పర్వాలేదన్పించిన రహానే.. బ్యాటర్‌గా మాత్రం దారుణంగా విఫలమయ్యాడు.
ప్రస్తుతం తమిళనాడుతో జరుగుతున్న సెమీఫైనల్స్‌లో సైతం అదే తీరును ఈ వెటరన్ కనబరిచాడు. కీలక సమయంలో బ్యాటింగ్‌కు వచ్చిన రహానే కేవలం 19 పరుగులు మాత్రమే చేశాడు. ఓవరాల్‌గా ఈ సీజన్‌లో 11 ఇన్నింగ్స్‌లలో కేవలం 134 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో కేవలం ఒక హాఫ్ సెంచరీ మాత్రమే ఉంది. ఈ క్రమంలో అతడి కెరీర్ ముగిసిపోయిందని, భారత జట్టులోకి రీ ఎంట్రీ కష్టమేనని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అయితే 35 ఏళ్ల రహానే సైతం అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు దేశవాళీ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సీజన్ అనంతరం తన నిర్ణయాన్ని వెల్లడించే ఛాన్స్ ఉందని పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. ఇక 2013 టీమిండియా తరపున టెస్టులో అరంగేట్రం చేసిన అజింక్య రహానే ఇప్పటివరకు 85 టెస్టు మ్యాచులు ఆడాడు.
85 టెస్టుల్లో 12 సెంచరీల సాయంతో 5077 పరుగుల చేశాడు. అదేవిధంగా వన్డేల్లో 90 మ్యాచ్‌ల్లో 2962 పరుగులు చేశాడు. చివరగా ఈ ఏడాది జులై 20న వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో భారత తరపున రహానే ఆడాడు.
Comments
Please login to add a commentAdd a comment