
ట్రినిడాడ్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా వైస్ కెప్టెన్ అజింక్యా రహానే సంచలన క్యాచ్‌తో మెరిశాడు. బ్యాటింగ్‌లో విఫలమైనప్పటికీ.. ఫీల్డింగ్‌లో మాత్రం అదరగొట్టాడు. విండీస్ ఇన్నింగ్స్‌లో స్లిప్‌లో అద్బుతమైన క్యాచ్‌ను రహానే అందుకున్నాడు. మూడో రోజు ఆట ఫైనల్ సెషన్ తొలి ఓవర్ వేసేందుకు బంతిని జడ్డూ చేతికి రోహిత్ ఇచ్చాడు.
ఈ క్రమంలో 87 ఓవర్ వేసిన జడేజా బౌలింగ్‌లో మూడో బంతిని బ్లాక్‌వుడ్ డిఫెన్స్ ఆడటానికి ప్రయత్నం చేశాడు. అయితే బంతి బ్యాట్ ఎడ్జ్ తీసుకుని మొదటి స్లిప్‌వైపు వెళ్లింది. ఈ క్రమంలో మొదటి స్లిప్‌లో ఉన్న రహానే డైవ్‌చేస్తూ ఒంటి చెత్తో కళ్లు చెదిరే క్యాచ్‌ను అందుకున్నాడు. ఆ క్యాచ్ చూసిన విండీస్ బ్యాటర్ ఆశ్చర్యపోయాడు.
పిచ్ స్లో గా ఉన్నందన భారత బౌలర్లు వికెట్లు తీయడానికి చాలా కష్టపడుతున్నారు. ఇటువంటి సమయంలో రహానే తన అద్బుత క్యాచ్‌తో జట్టుకు కీలక వికెట్‌ను అందించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రహానేకు ఇది 102 టెస్టు మ్యాచ్ కావడం గమనార్హం.
ఇక మూడో రోజు ఆట ముగిసే సమయానికి వెస్టిండీస్ జట్టు 5 వికెట్ల నష్టానికి 229 స్కోరు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో విండీస్ జట్టు ఇంకా 209 పరుగుల వెనుకబడి ఉంది. క్రీజులో జేసన్ హోల్డర్ (11), అథనేజ్ (37) ఉన్నారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా రెండు వికెట్లు తీయగా.. మహ్మద్ సిరాజ్, అశ్విన్, తొలి టెస్టు ఆడుతున్న ముఖేశ్ కుమార్ తలా ఒక వికెట్ పడగొట్టారు.
Good sharp catch from Rahane 👏👏👏 pic.twitter.com/NNA1D0e7Bo
— Raja 🇮🇳 (@Raja15975) July 22, 2023
చదవండి: Roosh Kalaria: రిటైర్మెంట్ ప్రకటించిన ముంబై ఇండియన్స్ ప్లేయర్..