టీమిండియా వెటరన్ ఆటగాడు అజింక్య రహానే మరోసారి ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడనున్నాడు. . కౌంటీ ఛాంపియన్ షిప్ డివిజన్ టూలో లీసెస్టర్‌షైర్ క్రికెట్ క్లబ్‌కు రహానే ప్రాతినిధ్యం వహించనున్నాడు. వచ్చే నెలలో వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్ అనంతరం ఇంగ్లండ్‌కు రహానే పయనం కానున్నట్లు తెలుస్తోంది.
కాగా దాదాపు ఏడాదిన్నర తర్వాత జాతీయ జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చిన రహానే.. ఆస్ట్రేలియాతో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో 89 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇక ఈ ఏడాది జనవరిలోనే లీసెస్టర్‌షైర్ క్రికెట్ క్లబ్‌తో రహానే ఒప్పందం కుదుర్చుకున్నాడు.
ఈ ఒప్పందంలో భాగంగా 8 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు, రాయల్ లండన్ వన్డే కప్ మొత్తం రహానే ఆడనున్నాడు. కాగా అంతకుముందు 2019 కౌంటీ సీజన్‌లో హాంప్‌షైర్ తరపున రహానే ఆడాడు. ఇక ఇప్పటికే భారత్ నుంచి ఛతేశ్వర్ పుజారా, పేసర్ అర్ష్‌దీప్ సింగ్ ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడుతున్న సంగతి తెలిసిందే.
చదవండి: Virat Kohli: కోహ్లి సంపాదన ఎంతో తెలిస్తే షాక్!.. ఎవరికీ సాధ్యం కాని రీతిలో! ఎలా సంపాదిస్తున్నాడంటే?
Comments
Please login to add a commentAdd a comment