సీఎస్‌కే (PC: IPL)
IPL 2023- CSK Future Captain: మహేంద్ర సింగ్ ధోని.. ఈ పేరులేని చెన్నై సూపర్ కింగ్స్‌ను ఊహించలేం. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో నాలుగుసార్లు సీఎస్‌కేను చాంపియన్‌గా నిలిపిన ఘనత ధోనిది. మరి 41 ఏళ్ల ధోని రిటైరైన తర్వాత చెన్నైని ముందుండి నడిపించే నాయకుడు ఎవరు? సగటు అభిమానితో పాటు క్రీడా విశ్లేషకుల మధ్య కూడా ఈ అంశంపై చర్చ జరుగుతూనే ఉంది.
కెప్టెన్‌గా.. ఆటగాడిగానూ ఫెయిల్
గత సీజన్‌లో టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు పగ్గాలు అప్పగిస్తే ఏం జరిగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొత్త బాధ్యతల వల్ల ఇటు కెప్టెన్‌గా విఫలం కావడంతో పాటు.. అటు ఆటగాడిగా కూడా జడ్డూ ఫెయిలయ్యాడు. దీంతో మళ్లీ ధోని పగ్గాలు అందుకున్నప్పటికీ అప్పటికే పరిస్థితి చేజారిపోయింది.
డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన సీఎస్‌కే పద్నాలుగింట కేవలం నాలుగు విజయాలతో పాయింట్ల పట్టికలో తొమ్మిదోస్థానంలో నిలిచింది. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2023 ధోనికి ఆఖరి సీజన్ అన్న వార్తల నేపథ్యంలో మరోసారి సీఎస్‌కే కెప్టెన్సీ అంశం తెరమీదకు వచ్చింది.
రహానే బెస్ట్ ఆప్షన్
ఈ క్రమంలో పాకిస్తాన్ దిగ్గజ క్రికెటర్ వసీం అక్రం చెన్నై సారథిగా ధోని వారసుడి ఎంపిక గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ మేరకు.. ‘‘ఐపీఎల్-2022లో సీఎస్‌కే రవీంద్ర జడేజాను కెప్టెన్‌గా ట్రై చేసింది. దాంతో జట్టుతో పాటు జడ్డూ ప్రదర్శనపై కూడా ఎలాంటి ప్రభావం పడిందో అందరూ చూశారు.
మధ్యలోనే మళ్లీ కెప్టెన్‌ను మార్చాల్సి వచ్చింది. నాకు తెలిసి ప్రస్తుతం వాళ్ల ముందు రహానే కంటే మెరుగైన ఆప్షన్ లేదు. అతడు నిలకడైన ఆటతో ముందుకు సాగుతున్నాడు. స్థానిక(భారత) ఆటగాడు కూడా! ఫ్రాంఛైజ్ క్రికెట్‌లో లోకల్ క్రికెటర్లే కెప్టెన్లుగా రాణించడం చూస్తూనే ఉన్నాం.
నిజానికి విదేశీ ఆటగాళ్లను కెప్టెన్లను చేస్తే.. వారు తమ జట్టులో ఉన్న అందరి పేర్లు గుర్తు పెట్టుకోవడం కూడా వారికి కష్టమే. అలాంటిది వాళ్లు జట్టును ఎలా ముందుకు నడిపిస్తారు? ధోని గనుక సీఎస్‌కే పగ్గాలు వదిలేయాలని భావిస్తే.. నా దృష్టిలో మాత్రం ధోని వారసుడిగా రహానే మాత్రమే సరైనోడు’’ అని స్పోర్ట్స్ కీడాతో వసీం అక్రం వ్యాఖ్యానించాడు.
కానీ.. నమ్మకం ఉంటేనే
అయితే, డ్రెసింగ్ రూంలో పరిస్థితులు ఎలా ఉంటాయో మనకు తెలీదన్న అక్రం.. రహానేపై ఫ్రాంఛైజీకి నమ్మకం ఉంటేనే ఇలాంటి కీలక బాధ్యతలు అప్పజెప్పే అవకాశం ఉందని పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్-2023 సీజన్‌లో చెన్నై ఇప్పటి వరకు ఆడిన తొమ్మిది మ్యాచ్‌లలో 5 గెలిచింది.
దంచికొడుతున్న ఒకప్పటి వైస్ కెప్టెన్
ఇక ఈ సీజన్‌లో ఇప్పటి వరకు సీఎస్‌కే తరఫున 7 మ్యాచ్‌లలో ఆరు ఇన్నింగ్స్ ఆడిన అజింక్య రహానే 224 పరుగులు చేశాడు. ఈ ఎడిషన్‌లో తొలి ఫాస్టెస్ట్ ఫిఫ్టీ నమోదు చేయడం విశేషం. ఇక ఇప్పటిదాకా రహానే అత్యధిక స్కోరు 71(నాటౌట్). కాగా రహానేకు టీమిండియా వైస్ కెప్టెన్‌గా జట్టును నడిపించిన అనుభవం ఉంది. ముఖ్యంగా ఆస్ట్రేలియా పర్యటనలో నాటి సారథి విరాట్ కోహ్లి గైర్హాజరీలో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ గెలవడంలో రహానేది కీలక పాత్ర.
చదవండి: నా సర్వస్వం నువ్వే.. ఎప్పుడూ నీ చేయి వీడను: కోహ్లి ట్వీట్ వైరల్
MI Vs RR: గ్రహణం వీడింది..! అతడు భవిష్యత్ సూపర్‌స్టార్.. నో డౌట్!
Comments
Please login to add a commentAdd a comment