ట్రినిడాడ్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా అద్బుతంగా ఆడుతోంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టుకు ఓపెనర్లు రోహిత్ శర్మ, యశస్వీ జైశ్వాల్ మరోసారి అద్బుతమైన ఆరంభం ఇచ్చారు. వీరిద్దరూ కలిసి 23 ఓవర్లు ముగిసే సరికి తొలి వికెట్‌కు 118 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. రోహిత్ శర్మ(88 బంతుల్లో 61 నాటౌట్), యశస్వీ జైశ్వాల్(50) పరుగులతో క్రీజులో ఉన్నారు.
రోహిత్ శర్మ అరుదైన రికార్డు..
తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ చరిత్రలో 2000 పరుగుల మార్క్‌ను అందుకున్న తొలి భారత ఆటగాడిగా రోహిత్ రికార్డులకెక్కాడు. 45 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రోహిత్ ఈ ఘనత సాధించాడు. ఇప్పటివరకు డబ్ల్యూటీసీలో 25 మ్యాచ్‌లు (40) ఇన్నింగ్స్‌లు ఆడిన రోహిత్ 2017 పరుగులు చేశాడు.
రోహిత్ తర్వాత స్ధానంలో భారత్ నుంచి విరాట్ కోహ్లి(1942) ఉన్నాడు. కాగా ఇది వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ మూడో ఎడిషన్ ఉన్న విషయం తెలిసిందే. తొలి ఎడిషన్ విజేతగా న్యూజిలాండ్ నిలవగా.. రెండో ఎడిషన్‌లో ఆస్ట్రేలియా ఛాంపియన్‌గా నిలిచింది.
విండీస్‌తో రెండో టెస్టుకు భారత జట్టు: యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ(కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, రవీంద్ర జడేజా, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, జయదేవ్ ఉనద్కత్, ముఖేష్ కుమార్, మహ్మద్ సిరాజ్
చదవండి: IND vs WI: ఒకప్పుడు పోలీస్ అవ్వాలనుకున్నాడు.. కట్ చేస్తే ఇప్పుడు టీమిండియా క్రికెటర్!
Comments
Please login to add a commentAdd a comment