WTC Final 2023: Team India Captain Rohit Sharma Joins The Test Squad In England And Start Practice - Sakshi
Sakshi News home page

#WTCFinal2023: లండన్‌ చేరుకున్న రోహిత్‌ శర్మ.. టీమిండియాతో కలిసి ప్రాక్టీస్‌

Published Wed, May 31 2023 11:46 AM | Last Updated on Wed, May 31 2023 12:21 PM

Rohit Sharma Arrives London Join Team India Start-Practice-WTC Final 2023 - Sakshi

రెండు నెలల పాటు క్రికెట్‌ అభిమానులను అలరించిన ఐపీఎల్‌ 16వ సీజన్‌ ముగిసింది. ఇప్పుడు అందరి కళ్లు జూన్‌ 7న ప్రారంభం కానున్న వరల్డ్‌ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌(డబ్ల్యూటీసీ)పై నెలకొన్నాయి. 2021లో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో కివీస్‌ చేతిలో ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకున్న టీమిండియా ఈసారి మాత్రం ఎలాగైనా ఆస్ట్రేలియాను ఓడించి డబ్ల్యూటీసీ టైటిల్‌ను కైవసం చేసుకోవాలని చూస్తోంది. 

ఐపీఎల్ కారణంగా ఈ ఫైనల్ కోసం టీమిండియా విడతల వారీగా ఇంగ్లండ్ వెళ్తున్న విషయం తెలిసిందే. మొదట ఐపీఎల్ నుంచి లీగ్ స్టేజ్ లోనే ఇంటిదారి పట్టిన జట్లలోని సభ్యులు అక్కడికి వెళ్లారు. తాజాగా రోహిత్‌ శర్మ, యశస్వి జైశ్వాల్‌లు మంగళవారం లండన్‌కు చేరుకున్నారు. ఇక ఐపీఎల్‌ ఫైనల్‌ ఆడిన మహ్మద్‌ షమీ, అజింక్యా రహానే, గిల్‌, కేఎస్‌ భరత్‌లు గురువారం వరకు జట్టుతో కలవనున్నారు.

ఇక ఐపీఎల్‌లో క్వాలిఫయర్‌-2లో గుజరాత్‌ టైటాన్స్‌ చేతిలో ముంబై ఇండియన్స్‌ ఓటమిపాలైన సంగతి తెలిసిందే.ఆ మ్యాచ్ ముగిసిన మూడు రోజుల తర్వాత రోహిత్.. లండన్ వెళ్లాడు. ఇప్పటికే అక్కడ ఉన్న టీమ్ సభ్యులతో కలిసి డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం ప్రాక్టీస్ మొదలుపెట్టాడు.

2021-23 డబ్ల్యూటీసీ సైకిల్ లో ఇండియా, ఆస్ట్రేలియా టీమ్స్ ఫైనల్ చేరిన విషయం తెలిసిందే. ఈ ఫైనల్ జూన్ 7 నుంచి లండన్ లోని ఓవల్ గ్రౌండ్ లో జరగనుంది. మంగళవారం రోహిత్ తోపాటు యశస్వి జైస్వాల్ కూడా ఇంగ్లండ్ వెళ్లాడు. యశస్వి రిజర్వ్ ప్లేయర్స్ లిస్టులో ఉన్నాడు. తాను ఇంగ్లండ్ లో దిగిన తర్వాత ''WTC o’clock'' అనే క్యాప్షన్ తో తన ఫొటోను రోహిత్ ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు.

ముంబై ఇండియన్స్ కే చెందిన సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ కూడా రోహిత్ తో కలిసి వెళ్లారు. ఇప్పటికే ఇంగ్లండ్ లో ఉన్న విరాట్ కోహ్లి, చతేశ్వర్ పుజారా, అక్షర్ పటేల్, జైదేవ్ ఉనద్కట్, శార్దూల్ ఠాకూర్ లతో వీళ్లు కలిశారు. ఈ ఐపీఎల్లో కోహ్లితోపాటు సూర్య, షమి, జడేజా, శుభ్‌మన్ గిల్ లాంటి వాళ్లు టాప్ ఫామ్ లో ఉండటం డబ్ల్యూటీసీ ఫైనల్లో ఇండియాకు కలిసొచ్చేదే. రెండు నెలలుగా టి20 క్రికెట్‌ ఆడుతున్నా.. ఏదోరకంగా టీమిండియా ప్లేయర్స్ ఫీల్డ్లో ఉన్నారు. మరోవైపు ఆస్ట్రేలియా మాత్రం చాలా రోజులుగా క్రికెట్ ఫీల్డ్ కు దూరంగా ఉంది. ఫైనల్లోనూ ఎలాంటి వామప్ మ్యాచ్ లేకుండానే బరిలోకి దిగుతోంది.

చదవండి: డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు ఆస్ట్రేలియాకు గుడ్‌న్యూస్‌!

'అచ్చం నాలాగే.. రాయుడుకు ఆ అలవాటు లేదు'

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement