వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు అంతా సిద్ధమయింది. బుధవారం ఓవల్ వేదికగా టీమిండియా, ఆస్ట్రేలియా ఫైనల్ ఆడనున్నాయి. కాగా ఇరు జట్లకు చెందిన కెప్టెన్లు ఫోటో సెషన్‌లో పాల్గొన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కెప్టెన్స్ ఫోటో ఈవెంట్‌లో పాల్గొన్న రోహిత్ శర్మ, ప్యాట్ కమిన్స్‌లు పలు అభిప్రాయాలు వెల్లడించారు. వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ మేస్(గద)తో ఆ ఇద్దరూ ఫోటో దిగారు.
ఫైనల్ వరకు చేరేందుకు ఎంతో శ్రమించామని, ఇక మేస్‌ను అందుకోవడమే తమ లక్ష్యమని ఆసీస్ కెప్టెన్ కమిన్స్ అన్నాడు. ఇక్కడకు రావడం సంతోషంగా ఉందని, ఎన్నో విజయాలను దక్కించుకోవాల్సి వచ్చిందని ఇంట్లోనే కాదు.. విదేశీ టూర్లనూ సక్సెస్ సాధించామని కమ్మిన్స్ తెలిపాడు. గత కొన్నాళ్ల నుంచి తమ బృందం బాగా ప్రదర్శిస్తోందన్నాడు.
The Captains 👍
— BCCI (@BCCI) June 6, 2023
The Championship Mace 👌
The Big Battle 💪
All In Readiness for the #WTC23#TeamIndia pic.twitter.com/Ep10vb2aj5
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫైనల్‌పై తన అభిప్రాయాలను వ్యక్తం చేశాడు. గత కొన్నాళ్ల నుంచి తమ జట్టు నిలకడగా క్రికెట్ ఆడుతున్నట్లు చెప్పాడు. టోర్నమెంట్ చాలా టఫ్‌గా సాగిందని, గత రెండేళ్ల నుంచి నిలకడగా ఆడడం వల్లే ఈ దశకు చేరుకున్నట్లు రోహిత్ పేర్కొన్నాడు. అన్ని రంగాల్లో రాణించాలన్నారు. మూడు శాఖల్లోనూ బలంగా ఉన్నట్లు రోహిత్ చెప్పాడు. ఫైనల్ కోసం రోహిత్ సేన కఠోరంగా శ్రమిస్తోంది.
ఇరు జట్లకు ఓవల్ తటస్థ వేదికే. రెండు జట్లకూ సొంత అభిమానుల సపోర్ట్ లేదు. అయినా ఎక్కడ ఆడినా తమకు కొంత సపోర్టు ఉంటుందని రోహిత్ అన్నాడు. న్యూట్రల్ వేదికలపై ఆడడం తమకు అలవాటే అని పేర్కొన్నాడు. ఆస్ట్రేలియా ఇప్పటి వరకు వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ గెలవలేదని.. ట్రోఫీ సొంతం చేసుకుంటామన్న నమ్మకం ఉందని కెప్టెన్ కమిన్స్ తెలిపాడు.
చదవండి: WTC Final: రోహిత్ శర్మకు గాయం..? టీమిండియా అభిమానుల ఆందోళన
Comments
Please login to add a commentAdd a comment