ICC Announced Prize Money For Ind Vs Aus WTC 2023 Final Winner And Runner Up - Sakshi
Sakshi News home page

ICC WTC Finals 2023 Prize Money: డబ్ల్యూటీసీ 2021-23 ప్రైజ్‌మనీ వివరాలు ప్రకటించిన ఐసీసీ

Published Fri, May 26 2023 2:02 PM | Last Updated on Fri, May 26 2023 3:15 PM

ICC Announced Prize Money For WTC 2023 Final Winner And Runner Up - Sakshi

డబ్ల్యూటీసీ 2021-23 ప్రైజ్‌మనీ వివరాలను ఐసీసీ ఇవాళ (మే 26) ప్రకటించింది. భారత్‌-ఆస్ట్రేలియా మధ్య జూన్‌ 7న ప్రారంభంకానున్న ప్రతిష్టాత్మక ఫైనల్లో విజేతకు 1.6 మిలియన్‌ డాలర్ల ప్రైజ్‌మనీ దక్కనుండగా.. రన్నరప్‌కు 800,000 డాలర్లు ప్రైజ్‌మనీ రూపంలో దక్కనున్నాయి. ఈ డబ్ల్యూటీసీ సీజన్‌ సైతం గత సీజన్‌లో లాగే 3.8 మిలియన్‌ డాలర్ల పర్స్‌ విలువ కలిగి ఉంది.

తొలి స్థానంలో నిలిచే జట్టుకు 1.6 మిలియన్‌ డాలర్లు, రెండో స్థానంలో నిలిచే జట్టుకు 800,000 డాలర్లు​, మూడో స్థానంలో నిలిచిన దక్షిణాఫ్రికాకు 450,000 డాలర్లు, నాలుగో స్థానంలో నిలిచిన ఇంగ్లండ్‌కు 350,000 డాలర్లు, ఐదో ప్లేస్‌లో ఉన్న శ్రీలంకకు 200,000 డాలర్లు, ఆ తర్వాత ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిది స్థానాల్లో ఉన్న న్యూజిలాండ్, పాకిస్థాన్, వెస్టిండీస్, బంగ్లాదేశ్‌లకు తలో 100,000 డాలర్ల ప్రైజ్‌మనీ షేర్‌ చేయబడుతుంది.

చదవండి: కేఎస్‌ భరతా.. ఇషాన్‌ కిషనా..? డబ్ల్యూటీసీ ఫైనల్లో వికెట్‌కీపర్‌ ఎవరు..?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement