ఆసీస్‌తో డబ్ల్యూటీసీ ఫైనల్‌కు టీమిండియా సిద్ధం
WTC Final 2021-23- Ind Vs Aus: పొట్టి ఫార్మాట్ క్రికెట్ పండుగ ఐపీఎల్-2023 ముగిసింది. దాదాపు రెండు నెలల పాటు క్యాష్ రిచ్ లీగ్ ఫీవర్‌తో ఊగిపోయిన అభిమానులకు.. క్రికెట్‌లోని అసలైన మజా అందించేందుకు ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ రూపంలో మరో మెగా ఫైట్‌కు రంగం సిద్ధమైంది.
ఇంగ్లండ్ వేదికగా జూన్ 7న మొదలుకానున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా- ఆస్ట్రేలియా అమీతుమీ తేల్చుకోనున్నాయి. ప్రఖ్యాత ఓవల్ మైదానంలో జూన్ 11 వరకు నిర్వహించనున్న ఈ టెస్టు మ్యాచ్‌కు జూన్ 12 రిజర్వ్ డేగా నిర్ణయించారు.
వారిద్దరే కీలకం
ఈ క్రమంలో ఇప్పటికే బీసీసీఐ, క్రికెట్ ఆస్ట్రేలియా.. 15 మందితో కూడిన జట్లను ఖరారు చేశాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే టీమిండియా, ఆసీస్ మాజీ క్రికెటర్లు తుది జట్లపై అంచనాలు వేస్తుండగా.. ఆస్ట్రేలియా దిగ్గజ బ్యాటర్ రిక్కీ పాంటింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియాకు విరాట్ కోహ్లి, ఛతేశ్వర్ పుజారా కీలకంగా మారనున్నారని పేర్కొన్నాడు. ఆస్ట్రేలియా దృష్టి మొత్తం ఈ ఇద్దరిపైనే ఉంటుందని, వారిని త్వరగా పెవిలియన్‌కు పంపే వ్యూహాలతో ముందుకు వస్తుందని రిక్కీ పాంటింగ్ అభిప్రాయపడ్డాడు.
ఆసీస్ అంటే పూనకాలే
కాగా టీమిండియా నయావాల్ పుజారాకు ఆస్ట్రేలియా మీద మెరుగైన రికార్డు ఉంది. ఆసీస్‌తో ఆడిన 24 టెస్టుల్లో ఈ రైట్‌హ్యాండ్ బ్యాటర్ 2033 పరుగులు సాధించాడు. ఇందులో ఏకంగా ఐదు సెంచరీలు ఉండటం విశేషం.
మరోవైపు.. రన్‌మెషీన్ విరాట్ కోహ్లి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సంప్రదాయ క్రికెట్‌లో ఆసీస్‌తో 24 మ్యాచ్‌లలో కోహ్లి 1979 పరుగులు చేశాడు. ఆసీస్‌పై అతడి అత్యధిక స్కోరు 186. స్వదేశంలో ఇటీవల జరిగిన బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023 సందర్భంగా కోహ్లి సెంచరీతో మెరిశాడు.
విరాట్, పుజారాలను త్వరగా అవుట్ చేయాలని
ఇక అంతర్జాతీయ క్రికెట్‌లో మొత్తంగా 75 సెంచరీలు నమెదు చేసిన విరాట్ కోహ్లి.. ఐపీఎల్-2023లో వరుసగా రెండు శతకాలు బాది ఫుల్‌జోష్‌లో ఉన్నాడు. టీ20 క్రికెట్‌లో సత్తా చాటిన అతడు.. టెస్టుల్లోనూ రాణించేందుకు నెట్స్‌లో చెమటోడుస్తున్నాడు.
ఈ నేపథ్యంలో ఐసీసీ రివ్యూ షోలో రిక్కీ పాంటింగ్ మాట్లాడుతూ.. ‘‘ఆస్ట్రేలియా జట్టు ఎక్కువగా విరాట్ గురించే చర్చిస్తుంది. అతడిని ఎలా అవుట్ చేయాలన్న అంశంపై దృష్టి సారిస్తుందనడంలో సందేహం లేదు.
అదే విధంగా పుజారా గురించి కూడా మాట్లాడుకుంటారు. ఈ ఇద్దరిని త్వరగా పెవిలియన్‌కు పంపాలనే యోచనలో ఉంటారు. ఆస్ట్రేలియా మీద పుజారాకు మంచి రికార్డు ఉంది. నిజానికి ఓవల్ పిచ్ కూడా ఆసీస్ పిచ్‌లలాగే ఉండే అవకాశం ఉంది. కాబట్టి వాళ్లు అందుకు తగ్గట్లు ప్రణాళికలు రచిస్తారు’’ అని పేర్కొన్నాడు.
డబ్ల్యూటీసీ ఫైనల్ జట్లు
ఆస్ట్రేలియా టెస్ట్ జట్టు:
పాట్ కమిన్స్ (కెప్టెన్), వార్నర్, ఉస్మాన్ ఖ్వాజా, లబుషేన్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, అలెక్స్ క్యారీ, మిచెల్ స్టార్క్, హాజల్‌వుడ్, నాథన్ లయన్, టాడ్ మర్ఫీ, స్కాట్ బోలాండ్, కామెరాన్ గ్రీన్, మార్కస్ హారిస్, ఇంగ్లిస్.
టీమిండియా:
రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, అజింక్య రహానే, కేఎస్ భరత్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, జయదేవ్ ఉనాద్కట్, ఇషాన్ కిషన్.
స్టాండ్ బై ప్లేయర్లు: సూర్యకుమార్ యాదవ్, యశస్వి జైశ్వాల్, ముకేశ్ కుమార్.
చదవండి: #SKY: టీ20 మాస్టర్‌క్లాస్ చూశాను! నా కళ్ల ముందే.... వారెవ్వా!
SL Vs AFG: లంకతో వన్డే సిరీస్.. అఫ్గనిస్తాన్‌కు ఊహించని షాక్!
Comments
Please login to add a commentAdd a comment