అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) బుధవారం విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా బ్యాటర్లు సత్తా చాటారు. తొలి మూడు స్ధానాలను ఆసీస్ బ్యాటర్లే దక్కించుకోవడం విశేషం. లబుషేన్ తొలి ర్యాంకులో కొనసాగుతుండగా.. స్టీవ్ స్మిత్ రెండో ర్యాంకులో ఉన్నాడు. అయితే టీమిండియాతో జరిగిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో అదరగొట్టిన ట్రావిస్ హెడ్ మూడు స్ధానాలు ఎగబాకి మూడో ర్యాంక్ చేరుకున్నాడు.
తొలి ఇన్నింగ్స్ లో ధాటిగా ఆడిన హెడ్ 174 బంతుల్లోనే 163 పరుగులు చేశాడు. అతడితో పాటు స్మిత్ కూడా సెంచరీతో చెలరేగాడు. కాగా 39 ఏళ్ల తర్వాత ఒకే జట్టుకు చెందిన ముగ్గురు ఆటగాళ్లు టాప్ 3 ర్యాంకింగ్స్‌లో ఉండడం ఇదే తొలి సారి. 1984లో వెస్టిండీస్ ఆటగాళ్లు గోర్డాన్ గ్రీనిడ్జ్ (810), క్లైవ్ లాయిడ్ (787), లారీ గోమ్స్ (773) తొలి మూడు స్థానాల్లో నిలిచారు.
ఇక టీమిండియా విషయానికి వస్తే.. డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఆడకపోయనప్పటికీ వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన అగ్రస్థానాన్ని నిలబెట్టకున్నాడు. మరోవైపు రీ ఎంట్రీలో అదరగొట్టిన అజింక్య రహానే 37వ స్థానానికి చేరుకోగా, శార్దూల్ ఠాకూర్ బ్యాటర్లలో 94వ స్థానానికి చేరుకున్నాడు. ఇక టాప్ 10లో భారత్ తరపున డాషింగ్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ ఒక్కడే ఉన్నాడు. పంత్ 10 స్ధానంలో కొనసాగుతుండగా.. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి వరుసగా 13వ స్థానాల్లో ఉన్నారు.
చదవండి: IND vs WIL వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్.. హార్దిక్ పాండ్యా రీ ఎంట్రీ!
Comments
Please login to add a commentAdd a comment