లండన్‌లో విరాట్ కోహ్లి
WTC Final 2023- Ind Vs Aus- Virat Kohi In London: ఐపీఎల్-2023లో అదరగొట్టాడు టీమిండియా బ్యాటర్ విరాట్ కోహ్లి. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ముఖచిత్రమైన ఈ రన్‌మెషీన్ తాజా సీజన్‌లో పలు రికార్డులు సృష్టించాడు. అయితే, వ్యక్తిగతంగా కోహ్లి అద్భుత ప్రదర్శన కనబరిచినప్పటికీ జట్టు కనీసం ప్లే ఆఫ్స్ కూడా చేరకపోవడం అభిమానులను నిరాశకు గురిచేసింది.
ఇదిలా ఉంటే.. గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓటమి అనంతరం టోర్నీ నుంచి ఆర్సీబీ నిష్క్రమించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ 2021-23కి సిద్ధమయ్యే పనిలో పడ్డాడు విరాట్ కోహ్లి. ఈ క్రమంలో ఇప్పటికే ఇంగ్లండ్‌కు చేరుకున్నాడు.
చిల్ అవుతున్న కోహ్లి
కాగా ఇంగ్లండ్ వేదికగా టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్ జరుగనున్న విషయం తెలిసిందే. జూన్ 7న ఈ ప్రతిష్టాత్మక టెస్టు మ్యాచ్ మొదలుకానుంది. మ్యాచ్ ఆరంభానికి ఇంకా వారం రోజుల కంటే ఎక్కువే సమయం ఉన్న నేపథ్యంలో కాస్త చిల్ అవుతున్నాడు కోహ్లి.
‘ఇంగ్లండ్‌లో ఉన్నపుడు ఇలా ఉంటుంది’ అంటూ కాఫీని ఆస్వాదిస్తున్న ఫొటోను తాజాగా షేర్ చేశాడు. టీమిండియా ప్రాక్టీసు జెర్సీలో ఉన్న కోహ్లి షేర్ చేసిన ఈ ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. కాగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో విరాట్ కోహ్లి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
నాకు గుర్తే లేదు
‘‘ఎవరైనా నాకొక 12 గంటల ఫ్రీ టైమ్ ఇస్తే.. నేనైతే రోడ్ల మీద నడిచేందుకు ప్రాధాన్యం ఇస్తా. నాకు నచ్చిన షాప్‌నకు వెళ్లి.. నచ్చిన ఫుడ్ కొనుక్కుని తింటాను. కానీ ఇక్కడ(ఇండియాలో) అలా కుదరదు. చివరగా ఇండియాలో రోడ్ల మీద ఎప్పుడు నడిచానో గుర్తే లేదు’’ అని కోహ్లి వ్యాఖ్యానించాడు.
కాగా విరాట్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అతడు కనిపిస్తే చాలు చుట్టుముట్టేసి ప్రేమతో ఉక్కిరిబిక్కిరి చేస్తారు ఫ్యాన్స్. కాబట్టి కోహ్లి సాధారణ ప్రజల్లా రోడ్ల మీద తిరిగే పరిస్థితి ఉండదు. అందుకే ఇంగ్లండ్‌లో ఇలా తనకు నచ్చిన విధంగా ప్రకృతిని ఆస్వాదిస్తున్నాడు కోహ్లి.
మెగా ఫైట్‌లో రాణించాలి!
ఇక ఐపీఎల్-2023లో 14 మ్యాచ్‌లలో కలిపి 639 పరుగులు సాధించాడు కోహ్లి. ఇందులో రెండు వరుస శతకాలు ఉండటం విశేషం. డబ్ల్యూటీసీ ఫైనల్లోనూ ఇదే ఫామ్‌ను కొనసాగించాలని అతడి ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఇక ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌లో 75 సెంచరీలు పూర్తి చేసుకున్న కోహ్లి.. ఆస్ట్రేలియాతో జరుగనున్న ఈ మెగా ఫైట్‌లో అద్భుత ప్రదర్శన కనబరచాలని కోరుకుంటున్నారు.
కాగా ఐపీఎల్-2023 ముగించుకున్న విరాట్ కోహ్లి సహా శార్దూల్ ఠాకూర్, ఉమేశ్ యాదవ్ తదితరులు ఇప్పటికే అండన్ చేరుకుని ప్రాక్టీస్ మొదలుపెట్టారు. ఇక టీమిండియా సారథి రోహిత్ శర్మతో పాటు యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్(స్టాండ్ బై) ఆదివారం ఇంగ్లండ్‌కు పయనమయ్యారు.
చదవండి: రోహిత్ శర్మతో కలిసి లండన్‌కు యశస్వి.. తిలక్ వర్మ రియాక్షన్.. వైరల్
WTC Final: ఆసీస్ జట్టు నుంచి ఆ ఇద్దరు అవుట్.. మరి టీమిండియాలో?!
Comments
Please login to add a commentAdd a comment