Jersey Movie: Shahid Kapoor Said About His Horrific Lip Injury In Set - Sakshi
Sakshi News home page

Shahid Kapoor: ‘షూటింగ్‌లో గాయపడ్డ షాహిద్‌ కపూర్‌, పెదవికి 25 కుట్లు’

Published Mon, Nov 29 2021 8:40 AM | Last Updated on Mon, Nov 29 2021 10:49 AM

Shahid Kapoor Said About His Horrific Lip Injury In Jersey Movie Set - Sakshi

Shahid Kapoor Opens Up On His Horrific Lip Injury In Jersey Shooting Set: షూటింగ్స్‌లో ఒక్కోసారి అనుకోకుండా ప్రమాదాలు జరుగుతుంటాయి. వాటివల్ల కథానాయకులు తీవ్రంగా గాయపడ్డ సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఎక్కువడా యాక్షన్‌ చిత్రాల్లో పోరాట సన్నివేశాల సమయంలో హీరోలు గాయపడటం సహజమే. ఈ నేపథ్యంలో బాలీవుడ్‌ హీరో షాహిద్‌ కపూర్‌ కూడా ఇటీవల షూటింగ్‌ సెట్‌లో గాయపడినట్టు సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించాడు.

చదవండి: శివన్న అని పునీత్‌ నన్ను పిలుస్తున్నట్టు వినిపిస్తోంది: శివ రాజ్‌కుమార్‌

హిందీ ‘జెర్సీ’ సినిమా కోసం క్రికెట్‌ ప్రాక్టిస్‌ చేస్తుండగా తీవ్రంగా గాయపడినట్లు షాహిద్‌ పేర్కొన్నారు. గ్రౌండ్‌ క్రికెట్‌ ఆడుతుండగా తన కింది పెదవికి బాల్‌ బలంగా తాకడంతో 25 కుట్లు పడ్డాయని చెప్పాడు. కాగా గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో జాతీయ జట్టులో చోటు సంపాదించుకోవాలని తపించే క్రికెటర్‌గా షాహిద్‌కపూర్‌ నటిస్తున్నాడు. ఈ సినిమా తాలూకు ప్రయాణం గురించి ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో షాహిద్‌ కపూర్‌ ముచ్చటించాడు.

చదవండి: నాగ్‌ సరసన మెహరీన్‌

ఈ సందర్భంగా ‘క్రికెటర్‌ పాత్ర కోసం సన్నద్ధమవుతున్న సమయంలో ఓ రోజు బాల్‌ బలంగా తాకడంతో నా క్రింది పెదవి చిట్లింది. 25 కుట్లు పడ్డాయి. ఈ గాయం వల్ల నా పెదవి ఎప్పటికీ పనిచేయదని భయపడ్డా. కదిలించడమే కష్టమైంది. కోలుకోవడానికి చాలా రోజులు పట్టింది. ఈ ప్రమాదం కారణంగా రెండు నెలల పాటు షూటింగ్‌ను ఆపివేశాం’ అని గుర్తుచేసుకున్నారు. నాని కథానాయకుడిగా తెలుగులో రూపొందిన ‘జెర్సీ’కి రీమేక్‌ ఇది. హిందీలో అల్లు అరవింద్‌ సమర్పణలో దిల్‌రాజు, సూర్యదేవర నాగవంశీ, అమన్‌గిల్‌ నిర్మిస్తున్నారు.

చదవండి: ఆ సినిమా తర్వాత బిచ్చగాడినయ్యా: స్టార్‌ హీరో

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement