తమిళ ఆటకు రానా నిర్మాత | Rana Daggubati to produce Tamil remake of Nani starrer Jersey | Sakshi
Sakshi News home page

తమిళ ఆటకు రానా నిర్మాత

Published Thu, Jul 18 2019 12:20 AM | Last Updated on Sun, Aug 11 2019 12:52 PM

Rana Daggubati to produce Tamil remake of Nani starrer Jersey - Sakshi

విష్ణు విశాల్‌, రానా

కంటెంట్‌ బాగున్న సినిమాకు ఏ ఇండస్ట్రీలో అయినా మంచి ఆదరణ లభిస్తుంది. ఈ మధ్యకాలంలో తెలుగులో విడుదలైన ఇలాంటి చిత్రాల్లో ‘జెర్సీ’ ఒకటి. అందుకే ఈ సినిమాపై ఇతర భాషల దర్శక–నిర్మాతల దృష్టి పడింది. ఆల్రెడీ హిందీలో రీమేక్‌ కానుంది. అల్లు అరవింద్, ‘దిల్‌’రాజు, సూర్యదేవర నాగవంశీ నిర్మించనున్నారు. తాజాగా తమిళ రీమేక్‌ కూడా తెరపైకి వచ్చింది. ‘జెర్సీ’ తమిళ రీమేక్‌ రైట్స్‌ను హీరో రానా దక్కించుకున్నారని టాక్‌. ఇందులో రానా నటించబోవడం లేదు.

నిర్మాతగా మాత్రమే వ్యవహరించనున్నారు. ఇందులో విష్ణు విశాల్‌ తమిళ ‘జెర్సీ’ హీరోగా నటించనున్నారని తెలిసింది. రానా హీరోగా నటిస్తున్న ‘కాడన్‌’ (తెలుగులో ‘అరణ్య’) సినిమాలో విష్ణు విశాల్‌ ఓ కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా హిందీ వెర్షన్‌ ‘హాథీ మేరీ సాథీ’లో మాత్రం విష్ణు విశాల్‌ పాత్రను ఓ హిందీ నటుడు పోషిస్తున్నారు. అలాగే క్రికెట్‌పై విష్ణు విశాల్‌కు మంచి అవగాహన ఉందట. అందుకే  ‘జెర్సీ’ తమిళ రీమేక్‌లో విష్ణు విశాలే కన్ఫార్మ్‌ అనుకోవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement