పుణే: టీమిండియాతో జరిగిన తొలి వన్డేలో ఇంగ్లండ్ ఓపెనర్ జానీ బెయిర్ స్టో వేసుకున్న జెర్సీని గమనించారా!.. లేకపోతే ఈ వార్తను చదివేయండి. విషయంలోకి వెళితే.. తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఆటగాళ్లు వేసుకున్న జెర్సీపై పేరు, నెంబర్లు బ్లూ కలర్‌లో రాగా.. బెయిర్ స్టో వేసుకున్న జెర్సీపై మాత్రం అతని పేరు, నెంబర్ తెలుపు రంగులో ఉంది. వాస్తవానికి టీమిండియాతో జరిగిన టీ20 సిరీస్‌కు ఇంగ్లండ్ జట్టు ఈ జెర్సీలను ధరించింది. మ్యాచ్ విజయం అనంతరం వర్చువల్ కాన్ఫరెన్స్ ద్వారా ఈ అంశాన్ని చర్చించాడు.
'నేను వేసుకున్న జెర్సీ నా సహచరులు వేసుకున్న దాని కంటే కాస్త భిన్నంగా ఉంది. అయితే చిన్న మిస్ కమ్మునికేషన్ వల్ల ఈ పొరపాటు జరిగింది. టీ20 సిరీస్‌తో పాటు వన్డే సిరీస్‌కు మేం వేసుకోబోయే జెర్సీలు ఇంగ్లండ్ నుంచి వచ్చాయి. అవన్నీ ప్యాక్ చేసి ఉండడంతో మ్యాచ సమయానికి ప్యాక్ విప్పి జెర్సీ వేసుకున్నా. కానీ పొరపాటున టీ20 జెర్సీకి ఉపయోగించిన కలర్‌నే నా వన్డే జెర్సీకి వాడినట్లున్నారు. అంతే తప్ప నేను స్పెషల్‌గా ఎలాంటి జెర్సీని ధరించలేదు. సింపుల్‌గా ఇది విషయం అంటూ' చెప్పుకొచ్చాడు.
ఇక తొలి వన్డేలో బెయిర్ స్టో విధ్వంసం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కేవలం 66 బంతుల్లోనే 6 ఫోర్లు, 7 సిక్సర్లతో 94 పరుగులతో విధ్వం సం సృష్టించాడు. అతని దాటికి ఇంగ్లండ్ ఒక దశలో వికెట్లేమి కోల్పోకుండా 135 పరుగులతో పటిష్ట స్థితిలో నిలిచింది. కానీ అనూహ్యంగా బెయిర్ స్టో అవుట్ కావడం.. ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్ ఎవరు రాణించకపోవడంతో ఇంగ్లండ్ జట్టు 66 పరుగులతో పరాజయం చవిచూసింది. ఇక ఇరుజట్ల మధ్య రెండో వన్డే పుణే వేదికగా శుక్రవారం జరగనుంది.
చదవండి:
సుందర్, బెయిర్ స్టో గొడవ.. అంపైర్ జోక్యం
ధోని భయ్యా.. నాకు ఎల్ సైజ్ జెర్సీ పంపు: జడేజా
Comments
Please login to add a commentAdd a comment