టీ20 వరల్డ్‌కప్-2024 ప్రారంభానికి మరో ఐదు వారాల సమయం మాత్రమే మిగిలి ఉంది. జూన్ 1 నుంచి అమెరికా, వెస్టిండీస్‌ల వేదికగా ఈ మెగా టోర్నీ షురూ కానుంది. ఈ మెగా ఈవెంట్‌కు సమయం దగ్గరపడతుండడంతో క్రికెట్ బోర్డులు ఒక్కొక్కటిగా తమ జట్ల జెర్సీలను రిలీజ్ చేస్తున్నాయి.
ఈ క్రమంలో టీమిండియా వరల్డ్‌కప్ జెర్సీని బీసీసీఐ రివీల్ చేసింది. భారత క్రికెట్ జట్టు అధికారిక స్పాన్సర్ అడిడాస్ జెర్సీ రిలీజ్‌కు సంబంధించిన వీడియోను ఎక్స్‌లో పోస్ట్ చేసింది.
టీమిండియా జెర్సీలో.. వీ షేప్ నెక్కి ట్రై కలర్ స్ట్రిప్స్ ఉన్నాయి. ఈసారి జెర్సీలో బ్లూతో పాటు కాషాయం రంగు కూడా ఉంది. అడిడాస్‌కి చెందిన లోగో.. జెర్సీ కుడివైపు ఉంది.
బీసీసీఐ లోగో ఎడమవైపు ఉంది. అయితే ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు జెర్సీ బాగొలేదంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ మెగా టోర్నీలో టీమిండియా తమ తొలి మ్యాచ్‌లో జూన్5 న ఐర్లాండ్‌తో తలపడనుంది.
ఇక పొట్టి ప్రపంచకప్ కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ ఇటీవలే ప్రకటించింది. ఈ జట్టులో కేఎల్ రాహుల్, రింకూ సింగ్, శుబ్‌మన్ గిల్ వంటి స్టార్ క్రికెటర్లకు చోటు దక్కలేదు.
టీ20 వరల్డ్ కప్ భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), హర్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), యశస్వీ జైశ్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్,రిషభ్ పంత్, సంజూ శాంసన్ , శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేందర్ చాహల్, ఆర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్.
రిజర్వ్ ఆటగాళ్లు: శుభ్‌మాన్ గిల్, రింకు సింగ్, ఆవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్
Comments
Please login to add a commentAdd a comment