
దేవర భామ జాన్వీ కపూర్ మిస్టర్ అండ్ మిసెస్ మహీ చిత్రంలో నటిస్తోంది.

త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్లతో బిజీగా ఉంది ముద్దుగుమ్మ.

ఈ సందర్భంగా మహేంద్ర సింగ్ ధోనిపై ఆసక్తికర కామెంట్స్ చేసింది.

ఇటీవల ఐపీఎల్ మ్యాచుల్లో జెర్సీ నెంబర్ 6తో కనిపించింది జాన్వీ కపూర్.

ధోని జెర్సీ నంబర్ 7 కావడంతోనే తాను ఆ నంబర్‌ను ధరించలేదని తెలిపింది.

ఆ నంబర్ ఆయనకు మాత్రమే సొంతమని చెప్పుకొచ్చింది బాలీవుడ్ భామ.

జాన్వీ కపూర్ నటించిన ఈ చిత్రం మే 31న థియేటర్లలో సందడి చేయనుంది.









