
బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్‌కు జోడీ దొరికింది. తెలుగు హిట్ ‘జెర్సీ’ హిందీ రీమేక్‌లో షాహిద్ కపూర్ హీరోగా నటించనున్న సంగతి తెలిసిందే. తెలుగు చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికగా నటించారు. హిందీ ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటించనున్నారని బాలీవుడ్ సమాచారం. ఈ ఏడాది విడుదలైన హృతిక్ రోషన్ ‘సూపర్ 30’, జాన్ అబ్రహాం ‘బాల్తా హౌస్’ చిత్రాల్లోని నటనకు గాను మృణాల్‌కు మంచి మార్కులు పడ్డాయి. తెలుగు మాతృకకు దర్శకత్వం వహించిన గౌతమ్ తిన్ననూరియే హిందీ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు. ఇందులో షాహిద్ క్రికెటర్ పాత్రలో నటిస్తారన్నది తెలిసిన విషయమే. షాహిద్ ఆల్రెడీ క్రికెట్ ప్రాక్టీస్ కూడా స్టార్ట్ చేశారు. అల్లు అరవింద్, ‘దిల్’ రాజు అమన్ గిల్ నిర్మించనున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఆగస్టు 28న విడుదల కానుంది.