Signed Virat Kohli Framed India Jersey Available On Wisden Website, Know Auction Price - Sakshi
Sakshi News home page

Virat Kohli Jersey Auction: వేలానికి విరాట్‌ కోహ్లి జెర్సీ.. ధర ఎంతంటే

Published Wed, Apr 27 2022 1:40 PM | Last Updated on Wed, Apr 27 2022 2:59 PM

Signed Virat Kohli Framed India Jersey Available On Wisden Website - Sakshi

టీమిండియా స్టార్‌.. మనం ముద్దుగా 'మెషిన్‌ గన్‌' అని పిలుచుకునే విరాట్‌ కోహ్లికి అభిమానుల్లో ఎంత ఫాలోయింగ్‌ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. భారత క్రికెట్‌లో సచిన్‌, ధోని తర్వాత అత్యంత పాపులర్‌ అయిన వ్యక్తిగా కోహ్లి స్థానం సంపాదించాడు. ఇక ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్లు కలిగిన జాబితాలో కోహ్లి మూడో స్థానంలో ఉన్నాడు. ఫుట్‌బాల్‌ స్టార్స్‌ క్రిస్టియానో​రొనాల్డో, లియోనల్‌ మెస్సీ తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.

ఇక విషయంలోకి వెళితే.. ఇంగ్లీష్‌ క్రికెట్‌ మీడియా విజ్డెన్‌ విరాట్‌ కోహ్లి జెర్సీని వేలం వేయనుంది. కోహ్లి సంతకంతో కూడిన జెర్సీని ఒక ఫోటో ఫ్రేమ్‌లో పెట్టింది. జెర్సీతో పాటు కోహ్లికి సంబంధించిన ఫోటోలను కూడా ఫ్రేమ్‌లో ఉంచింది. ఈ జెర్సీని ఆఫ్‌లైన్‌ కాకుండా ఆన్‌లైన్‌ పద్దతిలో వేలం వేయనుంది. కోహ్లి జెర్సీ దక్కించుకోవాలంటే విజ్డెన్‌ వైబ్‌సైట్‌ను ఓపెన్‌ చేయాల్సిందే. కాగా విజ్డెన్‌ మీడియా కోహ్లి జెర్సీ ప్రారంభ ధరను 2499.99 పౌండ్లుగా నిర్ణయించింది(భారత కరెన్సీలో దాదాపు రూ. 2.42 లక్షలు). మరి కోహ్లి జెర్సీ ఎంతకు అమ్ముడవుతుందో వేచి చూడాలి.

ఇక కోహ్లి ప్రస్తుతం ఐపీఎల్‌ 2022లో బిజీగా ఉన్నాడు. ఆర్‌సీబీ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న కోహ్లి సీజన్‌లో దారుణంగా విఫలమవుతున్నాడు. ఇప్పటివరకు 9 మ్యాచ్‌లాడి 128 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో రెండు గోల్డెన్‌ డక్‌లు ఉండడం విశేషం. కాగా వరుసగా విఫలమవుతున్న కోహ్లిని జట్టు నుంచి కొన్ని మ్యాచ్‌లు దూరంగా ఉంచాలని అభిమానులు డిమాండ్‌ చేస్తున్నారు. కానీ ఆర్సీబీ యాజమాన్యం మాత్రం కోహ్లి రాణిస్తాడని ఆశాభావం వ్యక్తం చేసింది. మంగళవారం రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 145 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో ఆర్‌సీబీ 115 పరుగులకే ఆలౌట్‌ అయి పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇక ఆర్‌సీబీ తన తర్వాతి మ్యాచ్‌ను ఏప్రిల్‌ 30న గుజరాత్‌ టైటాన్స్‌తో ఆడనుంది.

చదవండి: Virat Kohli: ఎత్తుపల్లాలు సహజం.. జట్టు నుంచి తీసేయాలనడం కరెక్ట్‌ కాదు!

Trolls On Virat Kohli: ఓపెనర్‌గా వచ్చినా అదే ఆటతీరు.. పక్కన పెట్టాల్సిందేనా!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement