
'అభిమానానికి ఎల్లలు లేవు' అని అంటుంటారు. నిజమే.. ఒక్కోసారి ఆటగాడిపై అభిమానం తారాస్థాయికి చేరుకుంటుంది. ఎంతలా అంటే.. అతని జెర్సీ నుంచి వస్తున్న చెమట వాసనను కూడా ఆస్వాదించేంతలా. వినడానికి కాస్త వింతగా ఉన్న ఈ ఘటన ఒక ఫుట్‌బాల్ మ్యాచ్ సందర్భంగా చోటుచేసుకుంది. విషయంలోకి వెళితే.. బుండేస్‌లిగా ఫుట్‌బాల్ లీగ్‌లో భాగంగా గత శుక్రవారం(ఆగస్టు 12న) డోర్ట్‌మండ్, ప్రీబర్గ్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో డోర్ట్‌మెంట్ 3-1 తేడాతో విజయం అందుకుంది.
ఇదే మ్యాచ్‌లో డోర్టమంట్ మిడ్‌ఫీల్డర్ బెల్లింగమ్ రెండు గోల్స్‌తో కీలకపాత్ర పోషించాడు. కాగా మ్యాచ్ అనంతరం బెల్లింగమ్‌ను ఒక అభిమాని.. ''షర్ట్‌పై సైన్ చేసి నాకు గిఫ్ట్‌గా ఇవ్వగలరా'' అని అడిగింది. దానికి వెంటనే స్పందించిన బెల్లింగ్‌హమ్ తన షర్ట్‌ను విప్పేసి ఆమెకు గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఇక్కడివరకు బాగానే ఉంది. కాగా గిఫ్ట్ అందుకున్న యువతి పక్కనే మరొక మహిళ నిల్చున్నారు. ఆమె 19 ఏళ్ల బెల్లింగ్‌హమ్‌కు వీరాభిమాని.
బెల్లింగ్‌హమ్ షర్ట్‌ను ప్రేమతో దగ్గరికి తీసుకొని వాసన చూస్తూ తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. ఇది చూసిన టీనేజర్ కూడా సదరు మహిళ లాగానే జెర్సీ వాసన చూడడం విశేషం. మామూలుగా చెమట వాసనను భరించలేం. కానీ ఈ ఇద్దరు మాత్రం చెమట వాసనను కూడా ఆస్వాదించడాన్ని చూస్తే హద్దులు దాటిన అభిమానం ఏదైనా చేయిస్తుందని అనిపిస్తోంది.
చదవండి: Cristiano Ronaldo: ఫుట్‌బాల్ స్టార్ రొనాల్డోకు పోలీసుల వార్నింగ్..
Comments
Please login to add a commentAdd a comment