sniffs
-
అభిమానం పరాకాష్టకు.. చెమట వాసనను ఆస్వాదించిన వేళ
'అభిమానానికి ఎల్లలు లేవు' అని అంటుంటారు. నిజమే.. ఒక్కోసారి ఆటగాడిపై అభిమానం తారాస్థాయికి చేరుకుంటుంది. ఎంతలా అంటే.. అతని జెర్సీ నుంచి వస్తున్న చెమట వాసనను కూడా ఆస్వాదించేంతలా. వినడానికి కాస్త వింతగా ఉన్న ఈ ఘటన ఒక ఫుట్‌బాల్ మ్యాచ్ సందర్భంగా చోటుచేసుకుంది. విషయంలోకి వెళితే.. బుండేస్లిగా ఫుట్‌బాల్ లీగ్‌లో భాగంగా గత శుక్రవారం(ఆగస్టు 12న) డోర్ట్‌మండ్, ప్రీబర్గ్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో డోర్ట్మెంట్ 3-1 తేడాతో విజయం అందుకుంది. ఇదే మ్యాచ్‌లో డోర్టమంట్ మిడ్‌ఫీల్డర్ బెల్లింగమ్ రెండు గోల్స్‌తో కీలకపాత్ర పోషించాడు. కాగా మ్యాచ్ అనంతరం బెల్లింగమ్ను ఒక అభిమాని.. ''షర్ట్‌పై సైన్ చేసి నాకు గిఫ్ట్‌గా ఇవ్వగలరా'' అని అడిగింది. దానికి వెంటనే స్పందించిన బెల్లింగ్హమ్ తన షర్ట్‌ను విప్పేసి ఆమెకు గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఇక్కడివరకు బాగానే ఉంది. కాగా గిఫ్ట్ అందుకున్న యువతి పక్కనే మరొక మహిళ నిల్చున్నారు. ఆమె 19 ఏళ్ల బెల్లింగ్హమ్కు వీరాభిమాని. బెల్లింగ్హమ్ షర్ట్‌ను ప్రేమతో దగ్గరికి తీసుకొని వాసన చూస్తూ తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. ఇది చూసిన టీనేజర్ కూడా సదరు మహిళ లాగానే జెర్సీ వాసన చూడడం విశేషం. మామూలుగా చెమట వాసనను భరించలేం. కానీ ఈ ఇద్దరు మాత్రం చెమట వాసనను కూడా ఆస్వాదించడాన్ని చూస్తే హద్దులు దాటిన అభిమానం ఏదైనా చేయిస్తుందని అనిపిస్తోంది. చదవండి: Cristiano Ronaldo: ఫుట్‌బాల్ స్టార్ రొనాల్డోకు పోలీసుల వార్నింగ్.. -
Covid alarm: శరీరంలో వైరస్ ఉంటే మోత మోగుడే!
లండన్: కరోనా సోకిందా లేదా కనుగొనే పద్ధతిని మరింత వేగవంతం చేయడానికి ఓ పరికరాన్ని బ్రిటన్ శాస్త్రవేత్తలు అభివృద్ది చేశారు. దీని సాయంతో కరోనా సోకిన వ్యక్తిని అక్కడికక్కడే మనం కనిపెట్టగలమని చెప్తున్నారు. ఈ పరికరం కారణంగా వైరస్ వ్యాప్తిని కూడా అడ్డుకోవచ్చని బ్రిటన్ వైద్యుల అంటున్నారు. లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్ (ఎల్‌ఎస్‌హెచ్‌టిఎమ్), డర్హామ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల అధ్యయనాల ప్రకారం.. కోవిడ్ ఇన్ఫెక్షన్కు ప్రత్యేకమైన వాసన ఉందని, వోలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్లో మార్పుల వల్ల కరోనా రోగి నుంచి ఓ రకమైన వాసన వస్తుందని ఇప్పటికే తేల్చారు. దీని బట్టి ఈ పరికరానికి రోగి శరీరం నుంచి వచ్చే వాసన ఆధారంగా కోవిడ్‌ను నిర్ధారిస్తుందని వెల్లడించారు. ఈ పరికరానికి ‘కోవిడ్ అలారం’ అని పేరు పెట్టారు. డర్హామ్ విశ్వవిద్యాలయంతో ఎల్‌ఎస్‌హెచ్‌టిఎమ్, బయోటెక్ కంపెనీ రోబో సైంటిఫిక్ లిమిటెడ్ పరిశోధకుల నేతృత్వంలో.. ఆర్గానిక్ సెమీ కండక్టింగ్ సెన్సార్లతో ఈ పరికరాన్ని తయారు చేశారు. ‘ఈ అలారం ఫలితాలు నిజంగా ఆశాజనకంగా ఉన్నాయి. అయితే మరింత ఖచ్చితమైన ఫలితాల కోసం ఈ పరికరానికి మరిన్ని పరీక్షలు అవసరమని’ ఎల్ఎస్హెచ్టిఎమ్లోని వ్యాధి నియంత్రణ విభాగం ప్రొఫెసర్ జేమ్స్ లోగాన్ అన్నారు. చదవండి: రక్తం గడ్డ కట్టి వ్యక్తి మృతి, ఆ దేశంలో ఆస్ట్రాజెనెకా టీకా నిలిపివేత! -
12 కిలోమీటర్లు పరిగెత్తి పట్టేసింది!
బనశంకరి(కర్ణాటక): ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 12 కిలోమీటర్లు ఏకధాటిగా పరిగెత్తి పోలీసు జాగిలం నేరస్తుడిని పట్టుకుని అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. నేరస్తుడిని పట్టుకోవడంలో తమకు సహకరించిన శునకాన్ని పోలీస్ బాస్‌లు సముచితరీతిలో సన్మానించారు. దావణగెరె పోలీస్ డాగ్‌స్క్వాడ్‌లో ఉన్న తొమ్మిదేళ్ల తుంగా అనే డాబర్‌మెన్ శునకం రెండుగంటల్లో 12 కిలోమీటర్లు వెళ్లి హంతకుడి ఆచూకీ కనిపెట్టింది. చేతన్ అనే వ్యక్తి తన స్నేహితుడు చంద్రానాయక్ తదితరులతో కలిసి ధారవాడ జిల్లాలోని ఓ ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. ఒక సర్వీస్ రివాల్వర్, బంగారు నగలు దోచుకెళ్లి అందరూ సమానంగా పంచుకున్నారు. కానీ చంద్రానాయక్ తనకు వాటా ఎక్కువ కావాలని డిమాండ్ చేయడంతో చేతన్ ఆ సర్వీస్ రివాల్వర్‌తో అతన్ని కాల్చి చంపి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు శుక్రవారం రాత్రి 9.30 గంటల సమయంలో ఘటనాస్థలాన్ని జాగిలం తుంగాతో కలిసి పరిశీలించారు. వాసన పసిగట్టిన తుంగా పరుగులు తీస్తూ రెండు గంటల తర్వాత కాశీపుర తాండాలో వైన్‌షాప్ వద్దకు వెళ్లి అక్కడ హోటల్ వద్ద నిలబడింది. సమీపంలోని ఇంటి ముందుకు వెళ్లి గట్టిగా మొరగసాగింది. ఆ ఇల్లు చేతన్ బంధువుది కాగా, చేతన్ అక్కడే మొబైల్లో మాట్లాడుతున్నాడు. అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా చోరీ, హత్య చేసినట్లు నిజం ఒప్పుకున్నాడని చెన్నగిరి డీఎస్పీ ప్రశాంత్ మున్నోళ్లి తెలిపారు. పోలీసు జాగిలాలు గరిష్టంగా 8 కిలోమీటర్ల వరకూ వెళ్తాయి. కానీ తుంగా అంతదూరం వెళ్లడం గొప్ప విషయమని ఎస్పీ హనుమంతరాయ కొనియాడుతూ శునకాన్ని సన్మానించారు. తుంగా ఘనత కొద్ది నెలల క్రితమే దావణగెరె పోలీస్ డాగ్‌స్క్వాడ్‌లో చేరిన తుంగా కీలక కేసులను ఛేదించడంలో ప్రధానపాత్ర పోషించింది. 30 హత్య కేసులతో 60 కేసుల్లో పోలీసులకు సహాయపడింది. ప్రతిరోజు ఉదయం 5 గంట నుంచే తుంగా దినచర్య ప్రారంభమతుంది. సుమారు 8 కిలోమీటర్ల వరకు నడక, జాగింగ్ చేస్తుంది. (చిరుత కోసం రిస్క్, ‘రియల్ హీరో’పై ప్రశంసలు) -
పెద్దనోట్ల రద్దు భారీ కుంభకోణం-రాందేవ్
న్యూఢిల్లీ: ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్ డీమానిటేజేషన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత బ్యాంకర్ల అవినీతి లక్షల కోట్ల కుంభకోణానికి దారి తీయనుందని ఘాటుగా విమర్శించారు. రూ.3-4లక్షల కోట్ల కుంభకోణానికి దారి తీయనుందని వ్యాఖ్యానించారు.పెద్దనోట్ల రద్దు ప్రక్రియను ఇంకా బాగా అమలు చేసి ఉండాల్సిందని పేర్కొన్నారు. ప్రధానమంత్రి ని బ్యాంకర్లు తప్పు దారి పట్టించారన్నారు. అంతేకాదు బీజేపీతో తన సాన్నిహిత్యం ఇక పాతమాట అని రాందేవ్ వ్యాఖ్యానించడం విశేషం. పెద్ద నోట్ల రద్దు తర్వాత ప్రధానికి తమ మద్దతును తెలిపిన రాందేవ్ జైపూర్ లో ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారని జాతీయ మీడియా రిపోర్ట్ చేసింది. మోదీ అవినీతి బ్యాంకర్ల చేతిలో చిక్కారు. నగదు సరఫరా ఒక సమస్య కాదు, కానీ నగదు అవినీతి మార్గం పట్టడమే సమస్య అని రాందేవ్ వ్యాఖ్యానించినట్టు నివేదించింది. మరోవైపు ఇటీవల ప్రతిపక్ష రాజకీయ నాయకులు యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ , జేడీయూ నేత లాలూ ప్రసాద్ తో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే దీనిపై వ్యాఖ్యానించిడానికి రాం దేవ్ అనుచరులు నిరాకరించారు. పెద్దనోట్ల రద్దు తర్వాత పేదల కష్టాలు, వారి అసంతృప్తి, పెరుగుతున్న అసహనం నేపథ్యంలో ఇలా వ్యాఖ్యానించారన్నారు. కాగా నాణ్యతలేని ఉత్పత్తులను ప్రజలకు అందిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో రాందేవ్ బాబా పతంజలి కంపెనీకి కోర్టు రూ.11 లక్షల జరిమానా విధించింది. 2012లో హరిద్వార్ జిల్లా మేజిస్ట్రేట్ కోర్టులో నమోదైన ఈ కేసులో నాణ్యత ప్రమాణాలు పాటించడంలేదని అప్పుడే నిరూపితమైంది. అయితే గత నాలుగేళ్లుగా నానుతున్న ఈ కేసుపై భారీ జరిమానా విధించడం చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే.