ట్రెండింగ్‌లో 'జెర్సీ' ట్రైలర్‌.. మరో హిట్టు గ్యారెంటీ! | Jersey Trailer: Shahid Kapoor Impresses As Father | Sakshi
Sakshi News home page

Jersey Trailer: ఆకట్టుకుంటున్న 'జెర్సీ' ట్రైలర్‌.. షాహిద్‌ నటనకు ఫిదా

Published Tue, Nov 23 2021 8:27 PM | Last Updated on Tue, Nov 23 2021 9:02 PM

Jersey Trailer: Shahid Kapoor Impresses As Father - Sakshi

Jersey Trailer Is Out: ‘అర్జున్‌రెడ్డి’ హిందీ రీమేక్‌ ‘కబీర్‌సింగ్‌’ అనంతరం షాహిద్‌ కపూర్‌ చేస్తున్న మరో తెలుగు రీమేక్‌ జెర్సీ. నేచురల్‌ స్టార్‌ నాని నటించిన జెర్సీ మూవీని అదే పేరుతో బాలీవుడ్‌లోనూ రీమేక్‌ చేస్తున్నారు. తెలుగులో ఈ చిత్రాన్ని తెరకెక్కించిన  గౌతమ్‌ తిన్ననూరినే ఈ సినిమాను కూడా రూపొందించారు. ఈ  సినిమా డిసెంబర్‌ 31న విడుదల కానుంది. ఈ సందర్భంగా తాజాగా జెర్సీ ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్‌.

క్రికెట్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో షాహిద్‌ కపూర్‌కి జోడీగా మృణాల్‌ ఠాకూర్‌ నటించింది. పంకజ్ కపూర్, శిశిర్ శర్మ,శరద్ కేల్కర్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే పలుమార్లు రిలీజ్‌ డేట్‌ వాయిదా వేస్తే వస్తున్న ఈ చిత్రం ఎట్టకేలకు డిసెంబర్‌31న థియేటర్స్‌లో సందడి చేయనుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement