2023 వరల్డ్‌కప్ ప్రాక్టీస్ సెషన్‌ను టీమిండియా కొత్త ట్రైనింగ్ కిట్ ధరించి ప్రారంభించింది. మెగా టోర్నీలో తమ ఆరంభ మ్యాచ్ (అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో) కోసం ఇదివరకే చెన్నైకు చేరుకున్న రోహిత్ సేన.. కొత్త ట్రైనింగ్ కిట్‌లో నిన్నటి నుంచి ప్రాక్టీస్ చేస్తుంది. డ్రీమ్11 స్పాన్సర్ చేసిన ఈ కొత్త ట్రైనింగ్ కిట్ ఆరెంజ్ కలర్‌లో ఉంది. టీమిండియా రెగ్యులర్ జెర్సీల తరహాలోనే ఈ కిట్ భుజాలపై కూడా మూడు స్ట్రైప్స్ ఉన్నాయి.
Team India is sporting a new practice jersey🧡🤩
— CricTracker (@Cricketracker) October 5, 2023
📸: Disney + Hotstar pic.twitter.com/MRPe4SceOc
looks like boys in the orange jersey are ready to deliver (the world cup) 😉 https://t.co/x8ePswD5zn
— Swiggy (@Swiggy) October 5, 2023
Indian team in new Practice Jersey. pic.twitter.com/x8ToDJUiHy
— Johns. (@CricCrazyJohns) October 5, 2023
అలాగే కుడివైపు ఛాతిపై అడిడాస్ లోగో, ఎడమవైపు బీసీసీఐ ఎంబ్లెం ఉంది. ఆరెంజ్ కిట్‌లో కొత్తగా కనిపించిన టీమిండియాను చూసి భారత అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వెరైటీ కలర్‌లో టీమిండియా ఆటగాళ్లు చూడముచ్చటగా ఉన్నారని అనుకుంటున్నారు. జెర్సీ కలర్‌తో సంబంధం లేదు, ఈసారి వరల్డ్‌కప్ మనదే అంటూ సోషల్‌మీడియాను హోరెత్తిస్తున్నారు. కొత్త ట్రైనింగ్ కిట్‌లో విరాట్ కోహ్లి తదితర టీమిండియా ఆటగాళ్ల ఫోటోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నాయి.
Virat Kohli giving autographs to fans in Chennai. pic.twitter.com/20wHetv8xH
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 5, 2023
ఇదిలా ఉంటే, 2023 వరల్డ్‌కప్ ఇవాల్టి (అక్టోబర్ 5) ప్రారంభమైన విషయం తెలిసిందే. టోర్నీ తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్-న్యూజిలాండ్ జట్లు తలపడుతున్నాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ టాస్ గెలిచి ఇంగ్లండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. తొలుత బ్యాటింగ్ చేస్తున్న ఇంగ్లండ్ 30 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసింది. బెయిర్‌స్టో (33), డేవిడ్ మలాన్ (14), హ్యారీ బ్రూక్ (25), మొయిన్ అలీ (11) ఔట్ కాగా.. జో రూట్ (50), జోస్ బట్లర్ (30) క్రీజ్‌లో ఉన్నారు. మ్యాట్ హెన్రీ, మిచెల్ సాంట్నర్, రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్ తలో వికెట్ పడగొట్టారు.
Comments
Please login to add a commentAdd a comment