
నేచురల్ స్టార్ నాని హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా జెర్సీ. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు జైర్సీపై ప్రశంసలు కురిపించారు. తాజాగా మరో యంగ్ హీరో ఈ లిస్ట్ చేరాడు.
ఆర్‌ఎక్స్ 100 సినిమాతో సెన్సేషన్ సృష్టించిన యంగ్ హీరో కార్తికేయ. ప్రస్తుతం హిప్పీ, గుణ 369 సినిమాల్లో నటిస్తున్న ఈ యువ నటుడు నాని హీరోగా తెరకెక్కుతున్న గ్యాంగ్ లీడర్ సినిమాలో నెగెటివ్ టచ్ ఉన్న పాత్రలో నటించనున్నాడు. అయితే గతంలో నానితో కలిసి నటిస్తుండటంపై ఆనందం వ్యక్తం చేసిన కార్తికేయ.. జెర్సీ సినిమాను చూసి మరోసారి తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నాడు.
‘జెర్సీ సినిమా చూశాను. ఇన్నాళ్లు నానితో నటించబోతున్నందుకు ఆనందం ఉంది. కానీ ఇప్పుడు జెర్సీ సినిమాలో అర్జున్ పాత్ర పోషించిన వ్యక్తితో నటించబోతున్నందుకు చాలా గర్వంగా ఫీలవుతున్నా. ఓ తెలుగు సినిమా అభిమానిగా టాలీవుడ్‌లో నాని లాంటి గొప్ప నటుడు ఉన్నాడని కాలర్ ఎగరేస్తా. గౌతమ్ తిన్ననూరి గారు ఇంత మంచి సినిమా అందించినందుకు థ్యాంక్యూ. మీరు నవ్వించారు, ఏడిపించారు. ఎప్పటికీ గుర్తుండిపోయే ఓ క్లాసిక్‌ను అందించారు’ అంటూ ట్వీట్ చేశాడు కార్తికేయ.
Watched #jersey.Previously I was excited that i am gona act with #Naturalstar but now am super proud that am gona share screen with the man who played #Arjun in #jersey.As a telugu cinema fan i raise my collar up and say tollywood has this great acting talent called @NameisNani.
— Kartikeya Gummakonda (@ActorKartikeya) 28 April 2019